Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 16 వచనము 14

నిర్గమకాండము 15:2 యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను. ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను.

కీర్తనలు 63:1 దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును

కీర్తనలు 95:7 రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు.

కీర్తనలు 100:3 యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱలము.

కీర్తనలు 118:28 నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచెదను.

1దినవృత్తాంతములు 16:12 ఆయన దాసులగు ఇశ్రాయేలు వంశస్థులారా ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతివారలారా

కీర్తనలు 48:10 దేవా, నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు భూదిగంతములవరకు అంత గొప్పది నీ కుడిచెయ్యి నీతితో నిండియున్నది.

కీర్తనలు 48:11 నీ న్యాయవిధులనుబట్టి సీయోను పర్వతము సంతోషించునుగాక యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక.

కీర్తనలు 97:8 యెహోవా, సీయోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులనుబట్టి సంతోషించుచున్నారు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు.

కీర్తనలు 97:9 ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై యున్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొందియున్నావు.