Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 21 వచనము 1

2సమూయేలు 24:1 ఇంకొకమారు యెహోవా కోపము ఇశ్రాయేలీయులమీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇశ్రాయేలువారిని యూదావారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.

1రాజులు 22:20 అహాబు రామోత్గిలాదుమీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవియ్యగా, ఒకడు ఈ విధముగాను మరియొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి.

1రాజులు 22:21 అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి నేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవా ఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను.

1రాజులు 22:22 అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను.

యోబు 1:6 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది2 యగువాడు వారితో కలిసి వచ్చెను.

యోబు 1:7 యెహోవా నీవు ఎక్కడనుండి వచ్చితివని వాని నడుగగా అపవాది భూమిమీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను.

యోబు 1:8 అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతనివంటి వాడెవడును లేడు.

యోబు 1:9 అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా?

యోబు 1:10 నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుటచేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది.

యోబు 1:11 అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా

యోబు 1:12 యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవియ్యగా వాడు యెహోవా సన్నిధినుండి బయలువెళ్లెను.

యోబు 2:1 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరియొక దినము తటస్థింపగా, వారితోకూడ అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను.

యోబు 2:4 అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా.

యోబు 2:5 ఇంకొకసారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను.

యోబు 2:6 అందుకు యెహోవా అతడు నీ వశమున నున్నాడు; అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను.

జెకర్యా 3:1 మరియు యెహోవా దూత యెదుట ప్రధానయాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాదియై అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను.

మత్తయి 4:3 ఆ శోధకుడు ఆయనయొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను

లూకా 22:31 సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని

యోహాను 13:2 వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించియుండెను గనుక

అపోస్తలులకార్యములు 5:3 అప్పుడు పేతురు అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను.?

యాకోబు 1:13 దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు.

ప్రకటన 12:10 మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని రాత్రింబగళ్లు మన దేవుని యెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడియున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.

లూకా 11:53 ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరిసయ్యులును ఆయనమీద నిండ పగబట్టి ఆయనమీద నేరము మోపవలెనని యుండి, ఆయన నోటనుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచి,

హెబ్రీయులకు 10:24 కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు,

సంఖ్యాకాండము 1:2 ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వారి వారి పెద్దలచొప్పున మగవారినందరిని లెక్కించి సర్వసమాజసంఖ్యను వ్రాయించుము.

సంఖ్యాకాండము 26:4 మోయాబు మైదానములలో యెరికోయొద్దనున్న యొర్దాను దగ్గరనుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి.

యెహోషువ 22:18 మీరు ఈ దిన మున యెహోవా వెంబడి నుండి తొలగిపోవునట్టు నేడు యెహోవా మీద తిరుగ బడి ద్రోహము చేసెదరేమి? ఆలాగైతె ఆయన ఇకమీదట ఇశ్రాయేలీయుల సర్వసమా జముమీద కోపపడును గదా?

1సమూయేలు 26:19 రాజా నా యేలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నామీద పడవలెనని యెహోవా నిన్ను ప్రేరేపించిన యెడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించినయెడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీవు దేశమును విడిచి అన్యదేవతలను పూజించుమని నాతో చెప్పి, యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండ నన్ను వెలివేయుచున్నారు.

1దినవృత్తాంతములు 7:2 తోలా కుమారులు ఉజ్జీ రెఫాయా యెరీయేలు యహ్మయి యిబ్శాము షెమూయేలు; తోలాకు పుట్టిన వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు; వీరు తమ తరములలో పరాక్రమశాలులై యుండిరి; దావీదు దినములలో వీరి సంఖ్యయిరువది రెండువేల ఆరువందలు.

1దినవృత్తాంతములు 7:7 బెల కుమారులు అయిదుగురు; ఎస్బోను ఉజ్జీ ఉజ్జీయేలు యెరీమోతు ఈరీ. వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు; వీరి వంశములో చేరినవారు ఇరువది రెండువేల ముప్పది నలుగురు.

1దినవృత్తాంతములు 7:40 ఆషేరు సంతతివారైన వీరందరును తమ పితరుల యిండ్లకు పెద్దలును ప్రఖ్యాతినొందిన పరాక్రమశాలులును అధిపతులలో ముఖ్యులునైయుండిరి. ఆ వంశపువారిలో యుద్ధమునకు పోతగినవారి లెక్క యిరువది యారువేలు.

1దినవృత్తాంతములు 27:24 జనసంఖ్య చేయు విషయమున ఇశ్రాయేలీయులమీదికి కోపము వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాని చేయనారంభించెనే గాని దాని ముగింపకపోయెను; కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు.

2దినవృత్తాంతములు 32:25 అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారిమీదికిని కోపము రాగా

మత్తయి 4:10 యేసు వానితో సాతానా, పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి యున్నదనెను.

మత్తయి 16:23 అయితే ఆయన పేతురువైపు తిరిగి సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతరకారణమై యున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని పేతురుతో చెప్పెను

యోహాను 8:44 మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడై యుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.

2కొరిందీయులకు 2:11 నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు, మీ నిమిత్తము, క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను; సాతాను తంత్రములను మనము ఎరుగనివారము కాము.

ప్రకటన 12:9 కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.