Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 22 వచనము 15

1దినవృత్తాంతములు 22:2 తరువాత దావీదు ఇశ్రాయేలీయుల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి, దేవుని మందిరమును కట్టించుటకై రాళ్లు చెక్కువారిని నియమించెను.

1దినవృత్తాంతములు 22:3 వాకిళ్ల తలుపులకు కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన యినుమును తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని

1దినవృత్తాంతములు 22:4 ఎంచనలవికానన్ని దేవదారు మ్రానులను దావీదు సంపాదించెను; సీదోనీయులును తూరీయులును దావీదునకు విస్తారమైన దేవదారు మ్రానులను తీసికొని వచ్చుచుండిరి.

నిర్గమకాండము 28:6 బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారతోను చిత్రకారుని పనిగా చేయవలెను.

నిర్గమకాండము 31:3 విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై

నిర్గమకాండము 31:4 రత్నములను సాన బెట్టుటకును కఱ్ఱనుకోసి చెక్కుటకును

నిర్గమకాండము 31:5 సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసియున్నాను.

నిర్గమకాండము 35:32 రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును,

నిర్గమకాండము 35:35 చెక్కువాడేమి చిత్రకారుడేమి నీలధూమ్ర రక్తవర్ణములతోను సన్ననారతోను బుటాపని చేయువాడేమి నేతగాడేమి చేయు సమస్తవిధములైన పనులు, అనగా ఏ పనియైనను చేయువారియొక్కయు విచిత్రమైన పని కల్పించు వారియొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు.

1రాజులు 7:14 ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై యుండెను; ఇతని తండ్రి తూరు పట్టణపువాడగు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడును ఇత్తడితో చేయు సమస్తమైన పనులలోను బహు చమత్కారపు పనివాడునై యుండెను; అతడు సొలొమోనునొద్దకు వచ్చి అతని పని అంతయు చేసెను.

2దినవృత్తాంతములు 2:7 నా తండ్రియైన దావీదు నియమించి యూదాదేశములోను యెరూషలేములోను నాయొద్ద ఉంచిన ప్రజ్ఞగలవారికి సహాయకుడైయుండి, బంగారముతోను వెండితోను ఇత్తడితోను ఇనుముతోను ఊదా నూలుతోను ఎఱ్ఱ నూలుతోను నీలి నూలుతోను చేయు పనియును అన్ని విధముల చెక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞగల మనుష్యునొకని నాయొద్దకు పంపుము.