Logo

2దినవృత్తాంతములు అధ్యాయము 18 వచనము 34

2దినవృత్తాంతములు 18:16 అతడు కాపరిలేని గొఱ్ఱలవలెనే ఇశ్రాయేలు వారందరును పర్వతములమీద చెదరిపోవుట చూచితిని; వీరికి యజమానుడు లేడనియు, వీరిలో ప్రతివాడు తన తన యింటికి సమాధానముగా పోవలెననియు యెహోవా సెలవిచ్చియున్నాడనెను.

2దినవృత్తాంతములు 18:19 ఇశ్రాయేలు రాజైన అహాబు రామోత్గిలాదుమీదికి పోయి పడిపోవునట్లు ఎవడు అతని ప్రేరేపించునని యెహోవా అడుగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చిరి.

2దినవృత్తాంతములు 18:27 అప్పుడు మీకాయా యిట్లనెను నీవు సురక్షితముగా తిరిగివచ్చినయెడల యెహోవా నా ద్వారా పలుకనే లేదనిచెప్పి, సమస్త జనులారా ఆలకించుడనెను.

సంఖ్యాకాండము 32:23 మీరు అట్లు చేయనియెడల యెహోవా దృష్టికి పాపము చేసినవారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలిసికొనుడి.

సామెతలు 13:21 కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును.

సామెతలు 28:17 ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి పరుగెత్తుచున్నాడు ఎవరును అట్టివానిని ఆపకూడదు.

1రాజులు 20:42 అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చునదేమనగా నేను శపించిన మనుష్యుని నీవు నీచేతిలోనుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులును అప్పగింపబడుదురని రాజుతో అనగా

2దినవృత్తాంతములు 18:11 ప్రవక్తలందరును ఆ ప్రకారముగానే ప్రవచించుచు యెహోవా రామోత్గిలాదును రాజు చేతికి అప్పగించును, దానిమీదికి పోయి జయమొందుము అనిరి.

యెషయా 44:25 నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను సోదెకాండ్రను వెఱ్ఱివారినిగా చేయువాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే.