Logo

2దినవృత్తాంతములు అధ్యాయము 31 వచనము 19

2దినవృత్తాంతములు 31:15 అతని చేతిక్రింద ఏదెను మిన్యామీను యేషూవ షెమయా అమర్యా షెకన్యా అనువారు నమ్మకమైనవారు గనుక యాజకుల పట్టణములందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతులచొప్పున భాగము లిచ్చుటకు నియమింపబడిరి.

లేవీయకాండము 25:34 వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు; అవి వారికి శాశ్వత స్వాస్థ్యము.

సంఖ్యాకాండము 35:2 ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెనని వారికాజ్ఞాపించుము; ఆ పురముల చుట్టునున్న పల్లెలను లేవీయులకియ్యవలెను.

సంఖ్యాకాండము 35:3 వారు నివసించుటకు ఆ పురములు వారివగును. వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతువులకును ఉండవలెను.

సంఖ్యాకాండము 35:4 మీరు లేవీయులకిచ్చు పురముల పల్లెల ప్రతి పురముయొక్క గోడ మొదలుకొని చుట్టు వెయ్యి మూరలు

సంఖ్యాకాండము 35:5 మరియు మీరు ఆ పురముల వెలుపలనుండి తూర్పుదిక్కున రెండువేల మూరలను, దక్షిణదిక్కున రెండువేల మూరలను, పడమటిదిక్కున రెండువేల మూరలను, ఉత్తరదిక్కున రెండువేల మూరలను కొలవవలెను. ఆ నడుమ పురముండవలెను. అది వారి పురములకు పల్లెలుగా నుండును.

1దినవృత్తాంతములు 6:54 అహరోను సంతతివారగు కహాతీయులు వంతువారు; వారి కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తావులనుబట్టి వారికి ఏర్పడిన నివాసస్థలములు ఇవి.

1దినవృత్తాంతములు 6:60 మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు.

2దినవృత్తాంతములు 31:12 వారు వాటిని సిద్ధపరచి ఏమియు అపహరింపకుండ కానుకలను పదియవ భాగములను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి; లేవీయుడైన కొనన్యా వాటిమీద విచారణకర్తగా నియమింపబడెను; అతని సహోదరుడైన షిమీ అతనికి సహకారిగా ఉండెను.

2దినవృత్తాంతములు 31:13 మరియు యెహీయేలు అజజ్యాహు నహతు అశాహేలు యెరీమోతు యోజాబాదు ఎలీయేలు ఇస్మక్యాహు మహతు బెనాయాలనువారు రాజైన హిజ్కియావలనను, దేవుని మందిరమునకు అధిపతియైన అజర్యావలనను, తాము పొందిన ఆజ్ఞచొప్పున కొనన్యా చేతిక్రిందను, అతని సహోదరుడగు షిమీ చేతిక్రిందను కనిపెట్టువారై యుండిరి.

2దినవృత్తాంతములు 31:14 తూర్పుతట్టు ద్వారమునొద్ద పాలకుడును ఇమ్నా కుమారుడునగు లేవీయుడైన కోరే యెహోవా కానుకలను అతిపరిశుద్ధమైనవాటిని పంచిపెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణలమీద నియమింపబడెను.

2దినవృత్తాంతములు 31:15 అతని చేతిక్రింద ఏదెను మిన్యామీను యేషూవ షెమయా అమర్యా షెకన్యా అనువారు నమ్మకమైనవారు గనుక యాజకుల పట్టణములందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతులచొప్పున భాగము లిచ్చుటకు నియమింపబడిరి.

2దినవృత్తాంతములు 28:15 పేళ్లు ఉదాహరింపబడినవారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపుసొమ్ముచేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె బెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదలమీద ఎక్కించి ఖర్జూరవృక్షములుగల పట్టణమగు యెరికోకు వారి సహోదరులయొద్దకు వారిని తోడుకొనివచ్చిరి; తరువాత వారు షోమ్రోనునకు మరల వెళ్లిరి.

లూకా 1:8 జెకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని యెదుట యాజక ధర్మము జరిగించుచుండగా