Logo

యోబు అధ్యాయము 3 వచనము 13

ప్రసంగి 6:3 ఒకడు నూరుమంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను, అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండినయెడల వాని గతికంటె పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకొనుచున్నాను

ప్రసంగి 6:4 అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును, దాని పేరు చీకటిచేత కమ్మబడెను.

ప్రసంగి 6:5 అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు, అతని గతికంటె దాని గతి నెమ్మది గలది.

ప్రసంగి 9:10 చేయుటకు నీచేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.

యోబు 7:21 నీవేల నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషము నేల క్షమింపవు? నేనిప్పుడు మంటిలో పండుకొనెదను నీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవు గాని నేను లేకపోయెదను.

యోబు 14:12 ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు. ఎవరును వారిని నిద్ర లేపజాలరు.

యెహెజ్కేలు 32:27 అయితే వీరు సున్నతిలేని వారిలో పడిపోయిన శూరులదగ్గర పండుకొనరు; వారు తమ యుధ్దాయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయి, తమ ఖడ్గములను తలలక్రింద ఉంచుకొని పండుకొందురు; వీరు సజీవుల లోకములో భయంకరులైరి గనుక వారి దోషము వారి యెముకలకు తగిలెను.

లూకా 16:22 ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను.