Logo

యోబు అధ్యాయము 4 వచనము 5

యోబు 3:25 ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నామీదికి వచ్చుచున్నది.

యోబు 3:26 నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది.

సామెతలు 24:10 శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకానివాడవగుదువు.

2కొరిందీయులకు 4:1 కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడినవారమై అధైర్యపడము.

2కొరిందీయులకు 4:16 కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు.

హెబ్రీయులకు 12:3 మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి.

హెబ్రీయులకు 12:5 మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము

యోబు 1:11 అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా

యోబు 2:5 ఇంకొకసారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను.

యోబు 19:21 దేవుని హస్తము నన్ను మొత్తియున్నది నామీద జాలిపడుడి నా స్నేహితులారా నామీద జాలిపడుడి.

ఆదికాండము 38:26 యూదా వాటిని గురుతు పట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటె నీతిమంతురాలని చెప్పి మరి యెప్పుడును ఆమెను కూడలేదు.

ఆదికాండము 45:3 అప్పుడు యోసేపు నేను యోసేపును; నా తండ్రి యింక బ్రదికియున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేక పోయిరి.

యోబు 6:2 నా దుఃఖము చక్కగా తూచబడును గాక దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక.

యోబు 15:4 నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు. దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు.

యోబు 35:15 ఆయన కోపముతో దండింపక పోయినందునను నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపక పోయినందునను

సామెతలు 3:11 నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు.