Logo

యోబు అధ్యాయము 9 వచనము 14

యోబు 4:19 జిగటమంటి యిండ్లలో నివసించువారియందు మంటిలో పుట్టినవారియందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును?

యోబు 25:6 మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగువంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.

1రాజులు 8:27 నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును?

యోబు 11:4 నా ఉపదేశము నిర్దోషమనియు దేవా, నీదృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే.

యోబు 11:5 దేవుడు నీతో మాటలాడిన మేలు ఆయనే నీతో వాదించిన మేలు

యోబు 23:4 ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశదపరచెదను వాదములతో నా నోరు నింపుకొనెదను.

యోబు 23:7 అప్పుడు యథార్ధవంతుడు ఆయనతో వ్యాజ్యెమాడవచ్చును. కావున నేను ఎన్నటికిని నా న్యాయాధిపతివలన శిక్ష నొందకపోవుదును.

యోబు 33:5 నీచేతనైనయెడల నాకుత్తరమిమ్ము నా యెదుట నీ వాదము సిద్ధపరచుకొనుము వ్యాజ్యెమాడుము.

2దినవృత్తాంతములు 6:18 మనుష్యులతో కలిసి దేవుడు భూమియందు నివాసము చేయునా? ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే; నేను కట్టిన యీ మందిరము నిన్ను పట్టునా?

యోబు 13:3 నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడగోరుచున్నాను దేవునితోనే వాదింపగోరుచున్నాను

యోబు 33:13 తన క్రియలలో దేనిగూర్చియు ఆయన ప్రత్యుత్తరమియ్యడు దేవుడు నరుల శక్తికి మించినవాడు, నీవేల ఆయనతో పోరాడుదువు?

యోబు 35:15 ఆయన కోపముతో దండింపక పోయినందునను నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపక పోయినందునను

యోబు 36:5 ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము చేయడు ఆయన వివేచనాశక్తి బహు బలమైనది.