Logo

యోబు అధ్యాయము 15 వచనము 2

యోబు 11:2 ప్రవాహముగా బయలువెళ్లు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా. వదరుబోతు వ్యాజ్యెము న్యాయమని యెంచదగునా?

యోబు 11:3 నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండవలెనా? ఎవడును నిన్ను అపహసింపకుండనే నీవు హాస్యము చేయుదువా?

యోబు 13:2 మీకు తెలిసినది నాకును తెలిసేయున్నది నేను మీకంటె తక్కువ జ్ఞానము గలవాడను కాను.

యాకోబు 3:13 మీలో జ్ఞానవివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.

యోబు 6:26 మాటలను గద్దించుదమని మీరనుకొందురా? నిరాశగలవాని మాటలు గాలివంటివే గదా.

యోబు 8:2 ఎంతకాలము నీవిట్టి మాటలాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటివాయెను.

హోషేయ 12:1 ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు; తూర్పు గాలిని వెంటాడుచున్నాడు; మానక దినమెల్ల అబద్దమాడుచు, బలాత్కారము చేయుచున్నాడు; జనులు అష్షూరీయులతో సంధి చేసెదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు.

యోబు 12:2 నిజముగా లోకములో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించిపోవును.

యోబు 16:3 ఈ గాలిమాటలు ముగిసిపోయెనా? నీకేమి బాధ కలుగుటచేత నాకుత్తరమిచ్చుచున్నావు?

యోబు 24:25 ఇప్పుడు ఈలాగు జరుగనియెడల నేను అబద్ధికుడనని రుజువు పరచువాడెవడు? నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు?

యోబు 33:3 నామాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును.

యోబు 34:35 యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి

యెషయా 44:20 వాడు బూడిదె తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసికొనిపోవుచున్నది వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు నా కుడిచేతిలో అబద్ధమున్నది గదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు.