Logo

యోబు అధ్యాయము 20 వచనము 19

యోబు 21:27 మీ తలంపులు నేనెరుగుదును మీరు నామీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి.

యోబు 21:28 అధిపతుల మందిరము ఎక్కడ నున్నది? భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరడుగుచున్నారే.

యోబు 22:6 ఏమియు ఇయ్యకయే నీ సోదరులయొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి వస్త్రహీనుల బట్టలను తీసికొంటివి

యోబు 24:2 సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు వారు అక్రమముచేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు.

యోబు 24:3 తండ్రిలేనివారి గాడిదను తోలివేయుదురు విధవరాలి యెద్దును తాకట్టుగా తీసికొందురు

యోబు 24:4 వారు మార్గములోనుండి దరిద్రులను తొలగించివేయుదురు దేశములోని బీదలు ఎవరికిని తెలియకుండ దాగవలసి వచ్చెను.

యోబు 24:5 అరణ్యములోని అడవిగాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పనిమీద బయలుదేరి వేటను వెదకుదురు ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరకును

యోబు 24:6 పొలములో వారు తమకొరకు గడ్డి కోసికొందురు దుష్టుల ద్రాక్షతోటలలో పరిగ ఏరుదురు.

యోబు 24:7 బట్టలులేక రాత్రి అంతయు పండుకొనియుందురు చలిలో వస్త్రహీనులై పడియుందురు.

యోబు 24:8 పర్వతములమీది జల్లులకు తడిసియుందురు చాటులేనందున బండను కౌగలించుకొందురు.

యోబు 24:9 తండ్రిలేని పిల్లను రొమ్మునుండి లాగువారు కలరు వారు దరిద్రులయొద్ద తాకట్టు పుచ్చుకొందురు

యోబు 24:10 దరిద్రులు వస్త్రహీనులై బట్టలులేక తిరుగులాడుదురు ఆకలిగొని పనలను మోయుదురు.

యోబు 24:11 వారు తమ యజమానుల గోడలలోపల నూనె గానుగలను ఆడించుదురు ద్రాక్ష గానుగలను త్రొక్కుచు దప్పిగలవారై యుందురు.

యోబు 24:12 జనముగల పట్టణములో మూలుగుదురు గాయపరచబడినవారు మొఱ్ఱపెట్టుదురు అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు.

యోబు 31:13 నా పనివాడైనను పనికత్తెయైనను నాతో వ్యాజ్యెమాడగా నేను వారి వ్యాజ్యెమును నిర్లక్ష్యము చేసినయెడల

యోబు 31:14 దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును?

యోబు 31:15 గర్భమున నన్ను పుట్టించినవాడు వారినికూడ పుట్టింపలేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా.

యోబు 31:16 బీదలు ఇచ్ఛయించినదానిని నేను బిగబట్టినయెడలను విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసినయెడలను

యోబు 31:17 తలిదండ్రులు లేనివారిని నా అన్నములో కొంచెమైనను తిననియ్యక నేను ఒంటరిగా భోజనము చేసినయెడలను

యోబు 31:18 ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను

యోబు 31:19 వారి దేహములు నన్ను దీవింపకపోయినయెడలను వారు నా గొఱ్ఱలబొచ్చుచేత వేడిమి పొందకపోయినయెడలను

యోబు 31:20 గుమ్మములో నాకు సహాయము దొరకునని తండ్రిలేనివారిని నేను అన్యాయము చేసినయెడలను

యోబు 31:21 నా భుజశల్యము దాని గూటినుండి పడును గాక నా బాహువు ఎముకలోనికి విరుగును గాక.

యోబు 31:22 నేనాలాగు చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కులేనివాడు తండ్రిభావముతో నన్ను భావించి నాయొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిననాటనుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని.

యోబు 31:38 నా భూమి నామీద మొఱ్ఱపెట్టినయెడలను దాని చాళ్లు ఏకమై యేడ్చినయెడల

యోబు 31:39 క్రయధనము ఇయ్యక దాని ననుభవించినయెడలను దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసినయెడలను

యోబు 35:9 అనేకులు బలాత్కారము చేయుటవలన జనులు కేకలు వేయుదురు బలవంతుల భుజబలమునకు భయపడి సహాయముకొరకై కేకలు వేయుదురు.

1సమూయేలు 12:3 ఇదిగో నేనున్నాను, నేనెవని యెద్దునైన తీసికొంటినా? ఎవని గార్దభమునైన పట్టుకొంటినా? ఎవనికైన అన్యాయము చేసితినా? ఎవనినైన బాధపెట్టితినా? న్యాయము నాకు అగపడకుండ ఎవనియొద్దనైన లంచము పుచ్చుకొంటినా? ఆలాగు చేసినయెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించినవాని యెదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను, అప్పుడు నేను మీ యెదుట దానిని మరల నిత్తుననెను.

1సమూయేలు 12:4 నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు; ఏ మనుష్యుని యొద్దగాని నీవు దేనినైనను తీసికొనలేదని వారు చెప్పగా

కీర్తనలు 10:18 తండ్రిలేనివారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి, చెవియొగ్గి ఆలకించితివి.

కీర్తనలు 12:5 బాధపడువారికి చేయబడిన బలాత్కారమునుబట్టియు దరిద్రుల నిట్టూర్పులనుబట్టియు నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

సామెతలు 14:31 దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు.

సామెతలు 22:22 దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు.

సామెతలు 22:23 యెహోవా వారి పక్షమున వ్యాజ్యెమాడును ఆయన వారిని దోచుకొనువారి ప్రాణమును దోచుకొనును.

ప్రసంగి 4:1 పిమ్మట సూర్యునిక్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు; వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడును లేకపోయెను.

ప్రసంగి 5:8 ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారముచేత మీరుటయు నీకు కనబడినయెడల దానికి ఆశ్చర్యపడకుము; అధికారము నొందినవారిమీద మరి ఎక్కువ అధికారము నొందినవారున్నారు; మరియు మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగా నున్నాడు.

యెహెజ్కేలు 22:29 మరియు సామాన్య జనులు బలాత్కారము చేయుచు దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు.

ఆమోసు 4:1 షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగగొట్టు వారలారా మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారలారా, యీ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా

ఆమోసు 4:2 ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకులచేతను, మీలో శేషించినవారిని గాలములచేతను పట్టుకొని లాగుదురు.

ఆమోసు 4:3 ఇటు అటు తొలగకుండ మీరందరు ప్రాకారపు గండ్లద్వారా పోవుదురు, హర్మోను మార్గమున వెలివేయబడుదురు; ఇదే యెహోవా వాక్కు.

యాకోబు 2:6 అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీమీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్నవారు వీరే గదా?

యాకోబు 2:13 కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయపడును.

యాకోబు 5:4 ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి.

ద్వితియోపదేశాకాండము 28:33 నీవెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు.

విలాపవాక్యములు 3:34 దేశమునందు చెరపట్టబడినవారినందరిని కాళ్లక్రింద త్రొక్కుటయు

యోబు 18:15 వారికి అన్యులైనవారు వారి గుడారములో నివాసము చేయుదురు వారి నివాసస్థలముమీద గంధకము చల్లబడును.

యోబు 24:2 సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు వారు అక్రమముచేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు.

1రాజులు 21:19 నీవు అతని చూచి యీలాగు ప్రకటించుము యెహోవా సెలవిచ్చునదేమనగా దీని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి గదా. యెహోవా సెలవిచ్చునదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను.

యెషయా 5:7 ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెనని చూడగా బలాత్కారము కనబడెను నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.

యెషయా 5:8 స్థలము మిగులకుండ మీరు మాత్రమే దేశములో నివసించునట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ.

మీకా 2:2 వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు, ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు.

మీకా 2:9 వారికిష్టమైన యిండ్లలోనుండి నా జనులయొక్క స్త్రీలను మీరు వెళ్లగొట్టుదురు, వారి బిడ్డలయొద్దనుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడును లేకుండ మీరు ఎత్తికొనిపోవుదురు.

నిర్గమకాండము 20:15 దొంగిలకూడదు.

లేవీయకాండము 6:4 అతడు పాపముచేసి అపరాధియగును గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గూర్చిగాని బలాత్కారముచేతను అపహరించినదాని గూర్చిగాని తనకు అప్పగింపబడినదాని గూర్చిగాని, పోయి తనకు దొరికినదాని గూర్చిగాని, దేనిగూర్చియైతే తాను అబద్ధప్రమాణము చేసెనో దానినంతయు మరల ఇచ్చుకొనవలెను.

లేవీయకాండము 25:14 నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయములోకాని నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయములో కాని మీరు ఒకరినొకరు బాధింపకూడదు.

2దినవృత్తాంతములు 16:10 ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతనిమీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేసెను, ఇదియు గాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరచెను.

యోబు 22:20 నీతిమంతులు దాని చూచి సంతోషించుదురు నిర్దోషులు వారిని హేళన చేయుదురు.

యోబు 27:13 దేవునివలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది ఇది బాధించువారు సర్వశక్తునివలన పొందు స్వాస్థ్యము

కీర్తనలు 62:10 బలాత్కారమందు నమ్మికయుంచకుడి దోచుకొనుటచేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి.

సామెతలు 11:17 దయగలవాడు తనకే మేలు చేసికొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును

సామెతలు 13:11 మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసికొనును.

సామెతలు 15:6 నీతిమంతుని యిల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము.

సామెతలు 22:16 లాభము నొందవలెనని దరిద్రులకు అన్యాయము చేయువానికిని ధనవంతుల కిచ్చువానికిని నష్టమే కలుగును.

యెహెజ్కేలు 45:9 మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలీయుల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును; ఆలాగు చేయుట మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

దానియేలు 5:6 అతని ముఖము వికారమాయెను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లువదలి అతని మోకాళ్లు గడగడ వణకుచు కొట్టుకొనుచుండెను.

హబక్కూకు 2:9 తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరచుకొని, తన యింటివారికొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొనువానికి శ్రమ.