Logo

యోబు అధ్యాయము 41 వచనము 8

1రాజులు 20:11 అందుకు ఇశ్రాయేలు రాజు తన ఆయుధమును నడుమున బిగించుకొనువాడు దానివిప్పి తీసివేసినవానివలె అతిశయపడకూడదని చెప్పుడనెను.

2రాజులు 10:4 వారు ఇది విని బహు భయపడి ఇద్దరు రాజులు అతనిముందర నిలువజాలకపోయిరే, మనమెట్లు నిలువగలమని అనుకొని

లూకా 14:31 మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమీదికి ఇరువదివేల మందితో వచ్చువానిని పదివేలమందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా?

లూకా 14:32 శక్తి లేనియెడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసికొన చూచును గదా.