సామెతలు 2:2 జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల
సామెతలు 2:3 తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవిచేసినయెడల
సామెతలు 2:4 వెండిని వెదకినట్లు దాని వెదకినయెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల
సామెతలు 4:6 జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును.
సామెతలు 4:7 జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము.
సామెతలు 4:8 దాని గొప్ప చేసినయెడల అది నిన్ను హెచ్చించును. దాని కౌగిలించినయెడల అది నీకు ఘనతను తెచ్చును.
యోబు 17:14 నీవు నాకు తండ్రివని గోతితోను నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేను మనవి చేయుచున్నాను.
పరమగీతము 8:1 నా తల్లియొద్ద స్తన్యపానము చేసిన యొక సహోదరునివలె నీవు నాయెడల నుండిన నెంత మేలు! అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవరును నన్ను నిందింపరు.
మత్తయి 12:49 తన శిష్యులవైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులును;
మత్తయి 12:50 పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు ననెను.
లూకా 11:27 ఆయన యీ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో నున్న యొక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలువేసి చెప్పగా
లూకా 11:28 ఆయన అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను.
సామెతలు 1:2 జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును
సామెతలు 4:1 కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి
సామెతలు 6:21 వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించుకొనుము నీ మెడచుట్టు వాటిని కట్టుకొనుము.