Logo

సామెతలు అధ్యాయము 14 వచనము 34

సామెతలు 12:16 మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును.

సామెతలు 12:23 వివేకియైనవాడు తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు.

సామెతలు 13:16 వివేకులందరు తెలివిగలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును.

సామెతలు 15:2 జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును.

సామెతలు 15:28 నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును

సామెతలు 29:11 బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును జ్ఞానము గలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును.

ప్రసంగి 10:3 బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికి తెలియజేయును.