Logo

సామెతలు అధ్యాయము 31 వచనము 27

సామెతలు 31:8 మూగవారికిని దిక్కులేని వారికందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము.

సామెతలు 31:9 నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము దీనులకును శ్రమపడువారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము.

న్యాయాధిపతులు 13:23 అతని భార్యయెహోవా మనలను చంపగోరినయెడల ఆయన దహనబలిని నైవేద్యమును మనచేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటిని మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను.

1సమూయేలు 25:24 నా యేలినవాడా, యీ దోషము నాదని యెంచుము; నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము;

1సమూయేలు 25:25 నా యేలినవాడా, దుష్టుడైన యీ నాబాలును లక్ష్యపెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది, అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము; నా యేలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు.

1సమూయేలు 25:26 నా యేలినవాడా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండ యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించెనన్నమాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులును నా యేలినవాడవైన నీకు కీడుచేయ నుద్దేశించువారును నాబాలువలె ఉందురు గాక.

1సమూయేలు 25:27 అయితే నేను నా యేలినవాడవగు నీయొద్దకు తెచ్చిన యీ కానుకను నా యేలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి

1సమూయేలు 25:28 నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. నా యేలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా యేలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రదుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును.

1సమూయేలు 25:29 నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైన ఉద్దేశించినయెడల, నా యేలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపుమూటలో కట్టబడును; ఒకడు వడిసెలతో రాయి విసరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయును.

1సమూయేలు 25:30 యెహోవా నా యేలినవాడవగు నిన్నుగూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయులమీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత

1సమూయేలు 25:31 నా యేలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకేగాని, నా యేలినవాడవగు నీవు పగతీర్చు కొనినందుకేగాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా యేలినవాడవగు నీకు ఎంత మాత్రమును కలుగకపోవును గాక, యెహోవా నా యేలినవాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకము చేసికొనుము అనెను.

2సమూయేలు 20:16 అప్పుడు యుక్తిగల యొక స్త్రీ ప్రాకారము ఎక్కి ఓహో ఆలకించుడి, ఆలకించుడి, నేను అతనితో మాటలాడునట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకవేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చెను.

2సమూయేలు 20:17 అంతట ఆమె యోవాబువు నీవేనా అని అతని నడుగగా అతడు నేనే అనెను. అందుకామె నీ దాసురాలనగు నేను నీతో మాటలాడుదునా అని అడుగగా అతడు మాటలాడవచ్చుననెను.

2సమూయేలు 20:18 అంతట ఆమె పూర్వకాలమున జనులు ఆబేలునందు సంగతి విచారింపవలెనని చెప్పుట కద్దు; ఆలాగున చేసి కార్యములు ముగించుచు వచ్చిరి.

2సమూయేలు 20:19 నేను ఇశ్రాయేలునందు నిమ్మళస్థులలోను యధార్థవంతులలోను చేరికయైనదానను; ఇశ్రాయేలీయుల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలెనని నీవు ఉద్దేశించుచున్నావు; యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయుదువని చెప్పగా

2సమూయేలు 20:20 యోవాబు నిర్మూలము చేయను, లయపరచను, ఆలాగున చేయనే చేయను, సంగతి అది కానే కాదు.

2సమూయేలు 20:21 బిక్రి కుమారుడగు షెబ అను ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజైన దావీదుమీద ద్రోహము చేసియున్నాడు; మీరు వానిని మాత్రము అప్పగించుడి; తోడనే నేను ఈ పట్టణము విడిచిపోవుదునని చెప్పగా ఆమె యోవాబుతో చిత్తము, వాని తల ప్రాకారము పైనుండి పడవేయబడునని చెప్పి పోయి

2సమూయేలు 20:22 తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికి తెలియ జేయగా, వారు బిక్రి కుమారుడగు షెబయొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తరువాత జనులందరును ఆ పట్టణమును విడిచి యెవరి గుడారములకు వారు పోయిరి; యోవాబు యెరూషలేమునకు రాజునొద్దకు తిరిగివచ్చెను.

2రాజులు 22:15 ఈమె వారితో ఇట్లనెను మిమ్మును నాయొద్దకు పంపినవానితో ఈ మాట తెలియజెప్పుడి

2రాజులు 22:16 యెహోవా సెలవిచ్చునదేమనగా యూదా రాజు చదివించిన గ్రంథములో వ్రాయబడియున్న కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండ నేను ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని రప్పింతును.

2రాజులు 22:17 ఈ జనులు నన్ను విడిచి యితరదేవతలకు ధూపము వేయుచు, తమ సకల కార్యములచేత నాకు కోపము పుట్టించియున్నారు గనుక నా కోపము ఆరిపోకుండ ఈ స్థలముమీద రగులుకొనుచున్నది.

2రాజులు 22:18 యెహోవాయొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదా రాజునకు ఈ మాట తెలియపరచుడి

2రాజులు 22:19 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ స్థలము పాడగుననియు, దాని కాపురస్థులు దూషణాస్పదులగుదురనియు, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి, మెత్తని మనస్సుకలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి, నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించియున్నాను.

2రాజులు 22:20 నేను నిన్ను నీ పితరులయొద్ద చేర్చుదును; నీవు నెమ్మది నొందినవాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలముమీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు; ఇదే యెహోవా వాక్కు. అంతట వారు ఈ వర్తమానమును రాజునొద్దకు తెచ్చిరి.

ఎస్తేరు 4:4 ఎస్తేరు యొక్క పనికత్తెలును ఆమెదగ్గరనున్న షండులును వచ్చి జరిగినదాని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము కలదై మొర్దెకై కట్టుకొనియున్న గోనెపట్టను తీసివేయుమని ఆజ్ఞ ఇచ్చి, కట్టించుకొనుటకై అతనియొద్దకు వస్త్రములు పంపెనుగాని అతడు వాటిని తీసికొనలేదు.

ఎస్తేరు 5:8 రాజవైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలెను. రాజవైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును; ఇదే నా మనవియు నా కోరికయు ననెను.

ఎస్తేరు 7:3 అప్పుడు రాణియైన ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను రాజా, నీ దృష్టికి నేను దయపొందినదాననైనయెడల రాజవైన తమకు సమ్మతియైతే, నా విజ్ఞాపననుబట్టి నా ప్రాణమును, నా మనవినిబట్టి నా జనులును, నా కనుగ్రహింపబడుదురు గాక.

ఎస్తేరు 7:4 సంహరింపబడుటకును, హతము చేయబడి నశించుటకును, నేనును నా జనులును కూడ అమ్మబడినవారము. మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడినయెడల నేను మౌనముగా నుందును; ఏలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజవగు తమరిని శ్రమపరచుట యుక్తముకాదు.

ఎస్తేరు 7:5 అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనస్సు ధృఢపరచుకొన్నవాడెవడు? వాడేడి? అని రాణియగు ఎస్తేరు నడుగగా

ఎస్తేరు 7:6 ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన యీ హామానే అనెను. అంతట హామాను రాజు ఎదుటను రాణి యెదుటను భయాక్రాంతుడాయెను.

ఎస్తేరు 8:3 మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవిచేసికొని, అతని పాదములమీద పడి, అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా

ఎస్తేరు 8:4 రాజు బంగారు దండమును ఎస్తేరుతట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి

ఎస్తేరు 8:5 రాజవైన తమకు సమ్మతియైనయెడలను, తమ దృష్టికి నేను దయపొందినదాననై రాజవైన తమ యెదుట ఈ సంగతి యుక్తముగా తోచినయెడలను, తమ దృష్టికి నేను ఇంపైన దాననైనయెడలను, రాజవైన తమ సకల సంస్థానములలో నుండు యూదులను నాశనము చేయవలెనని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామాను వ్రాయించిన తాకీదులచొప్పున జరుగకుండునట్లు వాటిని రద్దుచేయుటకు ఆజ్ఞ ఇయ్యుడి.

ఎస్తేరు 8:6 నా జనులమీదికి రాబోవు కీడును, నా వంశము యొక్క నాశనమును చూచి నేను ఏలాగు సహింపగలనని మనవిచేయగా

లూకా 1:38 అందుకు మరియ ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్దనుండి వెళ్లెను.

లూకా 1:42 స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును

లూకా 1:43 నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను?

లూకా 1:44 ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను.

లూకా 1:45 ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను.

లూకా 1:46 అప్పుడు మరియ యిట్లనెను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది.

లూకా 1:47 ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను

లూకా 1:48 నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను.

లూకా 1:49 సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరములవారును నన్ను ధన్యురాలని యందురు. ఆయన నామము పరిశుద్ధము.

లూకా 1:50 ఆయనకు భయపడు వారిమీద ఆయన కనికరము తరతరములకుండును.

లూకా 1:51 ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను.

లూకా 1:52 సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనులనెక్కించెను

లూకా 1:53 ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.

లూకా 1:54 అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతమువరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు

లూకా 1:55 ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను.

లూకా 1:56 అంతట మరియ, యించుమించు మూడు నెలలు ఆమెతో కూడ ఉండి, పిమ్మట తన యింటికి తిరిగి వెళ్లెను.

అపోస్తలులకార్యములు 18:26 ప్రిస్కిల్ల అకులయు విని, అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి.

ఎఫెసీయులకు 4:29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష యేదైనను మీనోట రానియ్యకుడి.

కొలొస్సయులకు 4:5 సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి.

సామెతలు 12:18 కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.

సామెతలు 16:24 ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్యకరమైనవి.

సామెతలు 25:15 దీర్ఘశాంతముచేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక యెముకలను నలుగగొట్టును.

ఆదికాండము 24:18 అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవనుచేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను.

ఆదికాండము 24:19 మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేది పోయుదునని చెప్పి

ఆదికాండము 24:20 త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొనిపోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేదిపోసెను.

పరమగీతము 2:14 బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము.

పరమగీతము 4:11 ప్రాణేశ్వరీ, నీ పెదవులు తేనియలొలుకుచున్నట్టున్నవి నీ జిహ్వక్రింద మధుక్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసనవలె నున్నది.

మలాకీ 2:6 సత్యముగల ధర్మశాస్త్రము బోధించుచు దుర్భోధ నేమాత్రమును చేయక సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు నన్ననుసరించి నడచుకొనువారై, దోషమునుండి యనేకులను త్రిప్పిరి.

అపోస్తలులకార్యములు 6:15 సభలో కూర్చున్నవారందరు అతనివైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనబడెను.

1పేతురు 3:1 అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;

1పేతురు 3:4 సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.

1పేతురు 3:5 అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడి యుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి.

1పేతురు 3:8 తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.

1పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.

1సమూయేలు 25:3 అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధిగలదై రూపసియై యుండెను. అయితే చర్యలనుబట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై యుండెను. అతడు కాలేబు సంతతివాడు.

ప్రసంగి 10:12 జ్ఞానుని నోటిమాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మింగివేయును.

పరమగీతము 4:3 నీ పెదవులు ఎరుపునూలును పోలియున్నవి. నీ నోరు సుందరము నీ ముసుకుగుండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలమువలె నగపడుచున్నవి.

1కొరిందీయులకు 13:4 ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;