Logo

ప్రసంగి అధ్యాయము 4 వచనము 3

ప్రసంగి 2:17 ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రదుకుట నాకసహ్యమాయెను.

ప్రసంగి 9:4 బ్రదికియుండువారితో కలిసిమెలిసి యున్నవారికి ఆశ కలదు; చచ్చిన సింహముకంటె బ్రదికియున్న కుక్క మేలు గదా.

ప్రసంగి 9:5 బ్రదికియుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడియున్నది, వారికిక ఏ లాభమును కలుగదు.

ప్రసంగి 9:6 వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు.

యోబు 3:17 అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు బలహీనులై అలసినవారు విశ్రాంతి నొందుదురు

యోబు 3:18 బంధింపబడినవారు కార్యనియామకుల శబ్దము వినక యేకముగా కూడి విశ్రమించుదురు

యోబు 3:19 అల్పులేమి ఘనులేమి అందరు నచ్చటనున్నారు దాసులు తమ యజమానుల వశమునుండి తప్పించుకొని స్వతంత్రులై యున్నారు.

యోబు 3:20 దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఏల?దుఃఖాక్రాంతులైనవారికి జీవమియ్యబడుట ఏల?

యోబు 3:21 వారు మరణము నపేక్షింతురు దాచబడిన ధనముకొరకైనట్టు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకకయున్నది.

ప్రసంగి 7:1 సుగంధతైలముకంటె మంచి పేరు మేలు; ఒకని జన్మదినముకంటె మరణదినమే మేలు.

యిర్మియా 22:10 చనిపోయినవానిగూర్చి యేడవవద్దు, వానిగూర్చి అంగలార్చవద్దు; వెళ్లిపోవుచున్నవానిగూర్చి బహు రోదనము చేయుడి. వాడు ఇకను తిరిగిరాడు, తన జన్మభూమిని చూడడు.

ప్రకటన 14:13 అంతట ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారివెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు