Logo

ప్రసంగి అధ్యాయము 10 వచనము 6

ప్రసంగి 4:7 నేనాలోచింపగా వ్యర్థమైనది మరియొకటి సూర్యుని క్రింద నాకు కనబడెను.

ప్రసంగి 5:13 సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తిగలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును.

ప్రసంగి 6:1 సూర్యుని క్రింద దురవస్థ యొకటి నాకు కనబడెను, అది మనుష్యులకు బహు విశేషముగా కలుగుచున్నది

ప్రసంగి 9:3 అందరికిని ఒక్కటే గతి సంభవించును, సూర్యునిక్రింద జరుగువాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది, వారు బ్రదుకుకాలమంతయు వారి హృదయమందు వెఱ్ఱితనముండును, తరువాత వారు మృతులయొద్దకు పోవుదురు ఇదియును దుఃఖకరము.

ప్రసంగి 3:16 మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను.

ప్రసంగి 4:1 పిమ్మట సూర్యునిక్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు; వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడును లేకపోయెను.

సామెతలు 19:10 భోగముల ననుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజులనేలుట దాసునికి బొత్తిగా తగదు.

సామెతలు 26:1 ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలె బుద్ధిహీనునికి ఘనత గిట్టదు.

సామెతలు 29:2 నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు.

ప్రసంగి 8:14 వ్యర్థమైనది మరియొకటి సూర్యునిక్రింద జరుగుచున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది; నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది; ఇదియును వ్యర్థమే అని నేననుకొంటిని.

యెషయా 3:5 ప్రజలలో ఒకడిట్లును మరియొకడట్లును ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తుడు చేయును. పెద్దవానిపైని బాలుడును ఘనునిపైని నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును.