Logo

దానియేలు అధ్యాయము 5 వచనము 28

యోబు 31:6 నేను యథార్థుడనై యున్నానని దేవుడు తెలిసికొనునట్లు

కీర్తనలు 62:9 అల్పులైనవారు వట్టి ఊపిరియై యున్నారు. ఘనులైనవారు మాయస్వరూపులు త్రాసులో వారందరు తేలిపోవుదురు వట్టి ఊపిరికన్న అలకనగా ఉన్నారు

యిర్మియా 6:30 యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండియని వారికి పేరు పెట్టబడును.

యెహెజ్కేలు 22:18 నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి మష్టువంటివారైరి, అందరును కొలిమిలోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసమునైరి, వారు వెండి మష్టువంటివారైరి.

యెహెజ్కేలు 22:19 కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరందరును మష్టువంటి వారైతిరి. నేను మిమ్మును యెరూషలేము మధ్యను పోగుచేసెదను, ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగుచేసి కొలిమిలో వేసి దానిమీద అగ్ని ఊది కరిగించినట్లు

యెహెజ్కేలు 22:20 నా కోపముచేతను రౌద్రముచేతను మిమ్మును పోగుచేసి అక్కడ మిమ్మును కరిగింతును.

మత్తయి 22:11 రాజు కూర్చున్నవారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లివస్త్రము ధరించుకొనని యొకని చూచి

మత్తయి 22:12 స్నేహితుడా, పెండ్లివస్త్రము లేక ఇక్కడికేలాగు వచ్చితివని అడుగగా వాడు మౌనియై యుండెను.

1కొరిందీయులకు 3:13 వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలుపరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.

1సమూయేలు 2:3 యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఇకను అంత గర్వముగా మాటలాడకుడి గర్వపుమాటలు మీ నోట రానియ్యకుడి.

సామెతలు 16:2 ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యెహోవా ఆత్మలను పరిశోధించును.

యెహెజ్కేలు 5:1 మరియు నరపుత్రుడా, నీవు మంగలకత్తివంటి వాడిగల కత్తియొకటి తీసికొని నీ తలను గడ్డమును క్షౌరము చేసికొని, త్రాసు తీసికొని ఆ వెండ్రుకలను తూచి భాగములు చేయుము.

ప్రకటన 3:2 నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై, చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము.