Logo

దానియేలు అధ్యాయము 10 వచనము 8

2రాజులు 6:17 యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను.

అపోస్తలులకార్యములు 9:7 అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరిగాని యెవనిని చూడక మౌనులై నిలువబడిరి.

అపోస్తలులకార్యములు 22:9 నాతోకూడ నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాటలాడినవాని స్వరము వారు వినలేదు.

యెహెజ్కేలు 12:18 నరపుత్రుడా, వణకుచునే ఆహారము తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లుత్రాగి

హెబ్రీయులకు 12:21 మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణకుచున్నాననెను.

ఆదికాండము 3:10 అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినిగనుక భయపడి దాగుకొంటిననెను.

యెషయా 2:10 యెహోవా భీకరసన్నిధినుండియు ఆయన ప్రభావ మహాత్మ్యమునుండియు బండ బీటలోనికి దూరుము మంటిలో దాగియుండుము.

యిర్మియా 23:24 యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైన కలడా? నేను భూమ్యాకాశముల యందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు.

నిర్గమకాండము 3:6 మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవునివైపు చూడ వెరచెను.

సంఖ్యాకాండము 22:23 యెహోవా దూత ఖడ్గము దూసి చేతపట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాని కొట్టగా

యోబు 37:1 దీనినిబట్టి నా హృదయము వణకుచున్నది దాని స్థలములోనుండి అది కదలింపబడుచున్నది.

యెహెజ్కేలు 1:28 వర్ష కాలమున కనబడు ఇంద్ర ధనుస్సుయొక్క తేజస్సువలె దాని చుట్టునున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను.

దానియేలు 8:1 రాజగు బెల్షస్సరు ప్రభుత్వపు మూడవ సంవత్సరమందు దానియేలను నాకు మొదట కలిగిన దర్శనము గాక మరియొక దర్శనము కలిగెను.

దానియేలు 8:17 అప్పుడతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను; అతడు రాగానే నేను మహా భయమొంది సాష్టాంగపడితిని; అతడు నరపుత్రుడా, యీ దర్శనము అంత్యకాలమునుగూర్చినదని తెలిసికొనుమనెను.

మత్తయి 17:6 శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా

మత్తయి 28:4 అతనికి భయపడుటవలన కావలివారు వణకి చచ్చినవారివలె నుండిరి.

మార్కు 16:5 అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి, తెల్లని నిలువుటంగీ ధరించుకొనియున్న యొక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి.

లూకా 1:12 జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడిన వాడాయెను.

లూకా 24:5 వారు భయపడి ముఖములను నేల మోపియుండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు?

అపోస్తలులకార్యములు 7:32 నేను నీ పితరుల దేవుడను, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోషే వణకి, నిదానించి చూచుటకు తెగింపలేదు.