Logo

జెఫన్యా అధ్యాయము 2 వచనము 14

కీర్తనలు 83:8 అష్షూరు దేశస్థులు వారితో కలిసియున్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు.(సెలా.)

కీర్తనలు 83:9 మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటియొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికిని చేయుము.

యెషయా 10:12 కావున సీయోను కొండమీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజుయొక్క హృదయగర్వమువలని ఫలమునుబట్టియు అతని కన్నుల అహంకారపు చూపులనుబట్టియు అతని శిక్షింతును.

యెషయా 10:16 ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా బలిసిన అష్షూరీయులమీదికి క్షయరోగము పంపును వారిక్రింద అగ్నిజ్వాలలుగల కొరవికట్టె రాజును.

యెషయా 11:11 ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులోనుండియు సముద్రద్వీపములలోనుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును

యెహెజ్కేలు 31:3 అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దానికొన బహు ఎత్తయినందున మేఘములకు అంటెను.

యెహెజ్కేలు 31:4 నీళ్లుండుటవలన అది మిక్కిలి గొప్పదాయెను, లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి యెత్తుగా పెరిగెను, అది యుండుచోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటికిని ప్రవహించెను.

యెహెజ్కేలు 31:5 కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటె ఎత్తుగలదాయెను, దాని శాఖలు బహు విస్తారములాయెను, నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్లు పెద్దకొమ్మలాయెను.

యెహెజ్కేలు 31:6 ఆకాశపక్షులన్నియు దాని శాఖలలో గూళ్లుకట్టుకొనెను, భూజంతువులన్నియు దాని కొమ్మలక్రింద పిల్లలు పెట్టెను, దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను.

యెహెజ్కేలు 31:7 ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలమున్నచోట పారుటవలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయెను.

యెహెజ్కేలు 31:8 దేవుని వనములోనున్న దేవదారు వృక్ష ములు దాని మరుగుచేయలేకపోయెను, సరళవృక్షములు దాని శాఖలంత గొప్పవికావు అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవికావు, దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికిని లేదు.

యెహెజ్కేలు 31:9 విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నియు దాని సొగసు చూచి దానియందు అసూయపడెను.

యెహెజ్కేలు 31:10 కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీ యెత్తునుబట్టి నీవు అతిశయపడితివి, తన కొన మేఘములకంటజేసి తన యెత్తునుబట్టి అతడు గర్విం చెను.

యెహెజ్కేలు 31:11 కాబట్టి యతని దుష్టత్వమునుబట్టి యతనిని తరిమివేసి, జనములలో బలముగల జనమునకు నేనతని నప్పగించెదను; ఆ జనము అతనికి తగినపని చేయును.

యెహెజ్కేలు 31:12 జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికిపారవేసిరి, కొండలలోను లోయలన్నిటిలోను అతని కొమ్మలు పడెను, భూమియందున్న వాగులలో అతని శాఖలు విరిగిపడెను, భూజనులందరును అతని నీడను విడిచి అతనిని పడియుండనిచ్చిరి.

యెహెజ్కేలు 31:13 పడిపోయిన అతని మోడుమీద ఆకాశపక్షులన్నియు దిగి వ్రాలును, అతని కొమ్మలమీద భూజంతువులన్నియు పడును.

యెహెజ్కేలు 31:14 నీరున్నచోటున నున్న వృక్షములన్నిటిలో ఏదియు తన యెత్తునుబట్టి అతిశయపడి, తన కొనను మేఘములకంటజేసి, యే వృక్షముగాని దాని యెత్తునుబట్టి గర్వింపకుండునట్లు, క్రిందిలోకమునకు పోవు నరులయొద్దకు దిగువారితోకూడ మరణము పాలైరి.

యెహెజ్కేలు 31:15 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా అతడు పాతాళములోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగజేసితిని, అగాధజలములు అతని కప్పజేసితిని, అనేక జలములను ఆపి అతనినిబట్టి నేను వాటి ప్రవాహములను బంధించితిని, అతనికొరకు నేను లెబానోను పర్వతమును గాఢాంధకారము కమ్మజేసితిని, ఫలవృక్షములన్నియు అతనిగూర్చి వ్యాకులపడెను, పాతాళములోనికి నేనతని దింపగా గోతిలోనికి పోవువారియొద్దకు అతని పడవేయగా

యెహెజ్కేలు 31:16 అతని పాటు ధ్వనిచేత జనములను వణకజేసితిని, నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠవృక్షములన్నియు ఏదెను వృక్షములన్నియు పాతాళములో తమ్మును తాము ఓదార్చుకొనిరి.

యెహెజ్కేలు 31:17 అన్యజనులమధ్య అతని నీడను నివసించి అతనికి సహాయులగువారు అతనితోకూడ పాతాళమునకు అతడు హతము చేసినవారియొద్దకు దిగిరి.

యెహెజ్కేలు 31:18 కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదెను వనములోని వృక్షములలో దేనికి సముడవు? నీవు పాతాళములోనికి త్రోయబడి, ఘనులై అక్కడికి దిగిపోయిన రాజులయొద్ద ఉందువు; ఖడ్గముచేత హతులైన వారియొద్దను సున్నతినొందని వారియొద్దను నీవు పడియున్నావు. ఫరోకును అతని సమూహమునకును ఈలాగు సంభవించును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

నహూము 1:1 నీనెవెనుగూర్చిన దేవోక్తి, ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము.

నహూము 2:10 అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది, జనుల హృదయము కరిగిపోవుచున్నది, మోకాళ్లు వణకుచున్నవి, అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోవుచున్నవి.

నహూము 2:11 సింహముల గుహ యేమాయెను? సింహపుపిల్లల మేతస్థలమేమాయెను? ఎవరును బెదరింపకుండ సింహమును ఆడుసింహమును సింహపు పిల్లలును తిరుగులాడు స్థలమేమాయెను?

నహూము 3:7 అప్పుడు నిన్ను చూచువారందరు నీయొద్దనుండి పారిపోయి నీనెవె పాడైపోయెనే, దానికొరకు అంగలార్చువారెవరు? నిన్ను ఓదార్చువారిని ఎక్కడనుండి పిలుచుకొని వచ్చెదము అందురు.

నహూము 3:15 అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనము చేయును, గొంగళిపురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును, నీవు సంఖ్యకు గొంగళి పురుగులంత విస్తారముగాను మిడుతలంత విస్తారముగాను ఉండుము.

నహూము 3:18 అష్షూరు రాజా, నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొనిరి, నీ జనులు పర్వతములమీద చెదరిపోయిరి, వారిని సమకూర్చువాడొకడును లేడు.

నహూము 3:19 నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు, జనులందరు ఎడతెగక నీచేత హింసనొందిరి, నిన్నుగూర్చిన వార్త వినువారందరు నీ విషయమై చప్పట్లు కొట్టుదురు.

జెకర్యా 10:10 ఐగుప్తు దేశములోనుండి వారిని మరల రప్పించి అష్షూరు దేశములోనుండి సమకూర్చి, యెక్కడను చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశములోనికిని లెబానోను దేశములోనికిని వారిని తోడుకొని వచ్చెదను.

జెకర్యా 10:11 యెహోవా దుఃఖసముద్రమును దాటి సముద్ర తరంగములను అణచివేయును, నైలునదియొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును, అష్షూరీయుల అతిశయాస్పదము కొట్టివేయబడును, ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు.

ఆదికాండము 10:11 ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును

కీర్తనలు 107:33 దేశనివాసుల చెడుతనమునుబట్టి

యెషయా 14:17 భూమిని కంపింపజేసి రాజ్యములను వణకించినవాడు ఇతడేనా? లోకమును అడవిగాచేసి దాని పట్టణములను పాడుచేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టినవారిని తమ నివాసస్థలమునకు పోనియ్యనివాడు ఇతడేనా?

యిర్మియా 49:33 హాసోరు చిరకాలము పాడై నక్కలకు నివాస స్థలముగా ఉండును అక్కడ ఏ మనుష్యుడును కాపురముండడు ఏ నరుడును దానిలో బసచేయడు.

యిర్మియా 50:18 కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోను రాజును అతని దేశమును దండించెదను.

యోనా 1:2 నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.

యోనా 3:2 నీవు లేచి నీనెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము.

నహూము 1:8 ప్రళయజలమువలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును, తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును,