Logo

మత్తయి అధ్యాయము 4 వచనము 13

మార్కు 1:14 యోహాను చెరపట్టబడిన తరువాత యేసు

మార్కు 6:17 హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియను పెండ్లిచేసికొనినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక

లూకా 3:20 అదివరకు తాను చేసినవన్నియు చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను.

లూకా 4:14 అప్పుడు యేసు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగివెళ్లెను; ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను.

లూకా 4:31 అప్పుడాయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి, విశ్రాంతిదినమున వారికి బోధించుచుండెను.

యోహాను 4:43 ఆ రెండు దినములైన తరువాత ఆయన అక్కడనుండి బయలుదేరి గలిలయకు వెళ్లెను.

యోహాను 4:54 ఇది యేసు యూదయనుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ.

మత్తయి 10:23 వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

మత్తయి 11:2 క్రీస్తు చేయుచున్న కార్యములనుగూర్చి యోహాను చెరసాలలో విని రాబోవువాడవు నీవేనా, మేము మరియొకనికొరకు కనిపెట్టవలెనా?

మత్తయి 14:3 ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా,

లూకా 23:5 అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి.

యోహాను 3:24 యోహాను ఇంకను చెరసాలలో వేయబడియుండలేదు.

అపోస్తలులకార్యములు 10:37 యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ యందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియును