Logo

మత్తయి అధ్యాయము 23 వచనము 7

మత్తయి 20:21 నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను.

సామెతలు 25:6 రాజు ఎదుట డంబము చూపకుము గొప్పవారున్న చోట నిలువకుము.

సామెతలు 25:7 నీ కన్నులు చూచిన ప్రధాని యెదుట ఒకడు నిన్ను తగ్గించుటకంటె ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు గదా.

మార్కు 12:38 మరియు ఆయన వారికి బోధించుచు నిట్లనెను శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను, సంతవీధులలో వందనములను

మార్కు 12:39 సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు

లూకా 11:43 అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజమందిరములలో అగ్రపీఠములను సంతవీధులలో వందనములను కోరుచున్నారు.

లూకా 11:44 అయ్యో, మీరు కనబడని సమాధులవలె ఉన్నారు; వాటిమీద నడుచు మనుష్యులు (అవి సమాధులని) యెరుగరనెను.

లూకా 11:45 అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు బోధకుడా, యీలాగు చెప్పి మమ్మును కూడ నిందించుచున్నావని ఆయనతో చెప్పగా

లూకా 11:46 ఆయన అయ్యో, ధర్మశాస్త్రోపదేశకులారా, మోయశక్యము కాని బరువులను మీరు మనుష్యులమీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు.

లూకా 11:47 అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు.

లూకా 11:48 కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు; వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులు కట్టించుదురు.

లూకా 11:49 అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా నేను వారియొద్దకు ప్రవక్తలను అపొస్తలులను పంపుదును.

లూకా 11:50 వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు.

లూకా 11:51 కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జెకర్యా రక్తమువరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరమువారు విచారింపబడుదురు; నిశ్చయముగా ఈ తరమువారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను.

లూకా 11:52 అయ్యో, ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపుచెవిని ఎత్తికొనిపోతిరి; మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించువారిని అడ్డగింతురని చెప్పెను.

లూకా 11:53 ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరిసయ్యులును ఆయనమీద నిండ పగబట్టి ఆయనమీద నేరము మోపవలెనని యుండి, ఆయన నోటనుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచి,

లూకా 11:54 వదకుచు చాల సంగతులనుగూర్చి ఆయనను మాటలాడింపసాగిరి.

లూకా 14:7 పిలువబడినవారు భోజనపంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.

లూకా 14:8 నిన్నెవరైనను పెండ్లివిందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు; ఒకవేళ నీకంటె ఘనుడు అతనిచేత పిలువబడగా

లూకా 14:9 నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును, అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండసాగుదువు.

లూకా 14:10 అయితే నీవు పిలువబడినప్పుడు, నిన్ను పిలిచినవాడు వచ్చి స్నేహితుడా, పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటిచోటున కూర్చుండుము; అప్పుడు నీతోకూడ కూర్చుండు వారందరియెదుట నీకు ఘనత కలుగును

లూకా 14:11 తన్నుతాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను.

లూకా 20:46 సంతవీధులలో వందనములను, సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు.

లూకా 20:47 వారు విధవరాండ్ర యిండ్లను దిగమింగుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను.

రోమీయులకు 12:10 సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి.

యాకోబు 2:1 నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై యుండకుడి.

యాకోబు 2:2 ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజమందిరము లోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినయెడల

యాకోబు 2:3 మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనినవానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పినయెడల

యాకోబు 2:4 మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసినవారగుదురు కారా?

3యోహాను 1:9 నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియొత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు.

మత్తయి 6:2 కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

మత్తయి 6:5 మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారులవలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజమందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

లూకా 9:46 తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా