Logo

యోహాను అధ్యాయము 6 వచనము 25

యోహాను 6:17 అంతలో చీకటాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు.

యోహాను 6:23 అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను.

యోహాను 7:11 పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెదకుచుండిరి.

యోహాను 18:4 యేసు తనకు సంభవింపబోవునవన్నియు ఎరిగినవాడై వారియొద్దకు వెళ్లి మీరెవని వెదకుచున్నారని వారిని అడిగెను.

యోహాను 18:5 వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను.

యోహాను 20:15 యేసు అమ్మా, యందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకుచున్నావు? అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా, నీవు ఆయనను మోసికొని పొయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొనిపోదునని చెప్పెను.

మార్కు 1:37 ఆయనను కనుగొని,అందరు నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా

లూకా 8:40 అంతట ఇదిగో సమాజమందిరపు అధికారియైన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదములమీద పడి

మత్తయి 4:13 నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను.

మార్కు 6:53 వారు అవతలకు వెళ్లి గెన్నేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి.

లూకా 4:42 ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లెను. జనసమూహము ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి, తమ్మును విడిచిపోకుండ ఆపగా

లూకా 14:25 బహు జనసమూహములు ఆయనతో కూడ వెళ్లుచున్నప్పుడు ఆయన వారితట్టు తిరిగి

యోహాను 6:59 ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజమందిరములో ఈ మాటలు చెప్పెను.