Logo

యోహాను అధ్యాయము 11 వచనము 39

యోహాను 11:33 ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనినెక్కడ నుంచితిరని అడుగగా,

యెహెజ్కేలు 9:4 యెహోవా యెరూషలేమను ఆ పట్టణములో ప్రవేశించి చుట్టు తిరిగి, దానిలో జరిగిన హేయకృత్యములనుగూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్నవారి లలాటముల గురుతు వేయుమని వారి కాజ్ఞాపించి

యెహెజ్కేలు 21:6 కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడువుము, వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువుము.

మార్కు 8:12 ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరమువారు ఎందుకు సూచక క్రియ నడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియయు ననుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి

ఆదికాండము 23:19 ఆ తరువాత అబ్రాహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రేయెదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్యయైన శారాను పాతిపెట్టెను.

ఆదికాండము 49:29 తరువాత అతడు వారి కాజ్ఞాపించుచు ఇట్లనెను నేను నా స్వజనులయొద్దకు చేర్చబడుచున్నాను.

ఆదికాండము 49:30 హిత్తీయుడైన ఎఫ్రోను భూమియందున్న గుహలో నా తండ్రులయొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే యెదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రాహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోనుయొద్ద శ్మశానభూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను.

ఆదికాండము 49:31 అక్కడనే వారు అబ్రాహామును అతని భార్యయైన శారాను పాతిపెట్టిరి; అక్కడనే ఇస్సాకును అతని భార్యయైన రిబ్కాను పాతి పెట్టిరి; అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని.

యెషయా 22:16 ఇక్కడ నీ కేమి పని? ఇక్కడ నీ కెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేల? ఎత్తయినస్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు

మత్తయి 27:60 తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను.

మత్తయి 27:66 వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని, రాతికి ముద్రవేసి సమాధిని భద్రము చేసిరి.

మార్కు 7:34 ఆకాశమువైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్ఫతా అని వానితో చెప్పెను; ఆ మాటకు తెరవబడుమని అర్థము.

మార్కు 15:46 అతడు నారబట్ట కొని, ఆయనను దింపి, ఆ బట్టతో చుట్టి, బండలో తొలిపించిన సమాధియందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను.

యోహాను 13:21 యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను