Logo

యోహాను అధ్యాయము 1 వచనము 29

యోహాను 10:40 యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడనుండెను.

న్యాయాధిపతులు 7:24 గిద్యోను ఎఫ్రాయిమీయుల మన్యదేశమంతటికిని దూతలను పంపిమిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి, బేత్బారావరకు వాగులను యొర్దానును వారికంటెముందుగా పట్టుకొనుడని చెప్పియుండెను గనుక, ఎఫ్రాయిమీయు లందరు కూడుకొని బేత్బారా వరకు వాగులను యొర్దానును పట్టుకొనిరి.

యోహాను 12:5 యీ అత్తరెందుకు మూడువందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను.

యోహాను 3:23 సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహానుకూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి.

యెహోషువ 22:11 అప్పుడు రూబే నీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలీయుల యెదుటివైపున యొర్దానుప్రదేశ ములో కనానుదేశము నెదుట బలిపీఠమును కట్టిరని ఇశ్రాయేలీయులకు వర్తమానము వచ్చెను.

మార్కు 1:5 అంతట యూదయ దేశస్థులందరును, యెరూషలేము వారందరును, బయలుదేరి అతనియొద్దకు వచ్చి, తమ పాపములను ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి

లూకా 3:3 అంతట అతడు వచ్చి, పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యొర్దాను నదీ ప్రదేశమందంతట ప్రకటించుచుండెను.

అపోస్తలులకార్యములు 1:22 ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానమునుగూర్చి సాక్షియైయుండుట ఆవశ్యకమని చెప్పెను.