Logo

ఎఫెసీయులకు అధ్యాయము 5 వచనము 2

ఎఫెసీయులకు 4:32 ఒకనియెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.

లేవీయకాండము 11:45 నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను.

మత్తయి 5:45 ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు.

మత్తయి 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.

లూకా 6:35 మీరైతే ఎట్టి వారినిగూర్చి యైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదై యుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన, కృతజ్ఞతలేనివారియెడలను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు.

లూకా 6:36 కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై యున్నట్టు మీరును కనికరము గలవారై యుండుడి.

1పేతురు 1:15 కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక,

1పేతురు 1:16 మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.

1యోహాను 4:11 ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింప బద్ధులమై యున్నాము.

యిర్మియా 31:20 ఎఫ్రాయిము నా కిష్టమైన కుమారుడా? నాకు ముద్దుబిడ్డా? నేనతనికి విరోధముగ మాటలాడునప్పుడెల్ల అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది, అతనిగూర్చి నా కడుపులో చాలా వేదనగా నున్నది, తప్పక నేనతని కరుణింతును; ఇదే యెహోవా వాక్కు.

హోషేయ 1:10 ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును; ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవముగల దేవుని కుమారులైయున్నారని వారితో చెప్పుదురు.

యోహాను 1:12 తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

కొలొస్సయులకు 3:12 కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.

1యోహాను 3:1 మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమననుగ్రహించెనొ చూడుడి; మనము దేవుని పిల్లలమే. ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు.

1యోహాను 3:2 ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము.

ద్వితియోపదేశాకాండము 15:15 ఆ హేతువుచేతను నేను ఈ సంగతి నేడు నీకాజ్ఞాపించియున్నాను.

ద్వితియోపదేశాకాండము 24:22 నీవు ఐగుప్తు దేశమందు దాసుడవైయుంటివని జ్ఞాపకము చేసికొనుము. అందుచేత ఈ కార్యము చేయవలెనని నీకాజ్ఞాపించుచున్నాను.

1సమూయేలు 20:14 అయితే నేను బ్రదికియుండినయెడల నేను చావకుండ యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపక పోయినయెడల నేమి,

యోబు 29:16 దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగనివారి వ్యాజ్యెమును నేను శ్రద్ధగా విచారించితిని.

కీర్తనలు 26:3 నీ కృప నా కన్నులయెదుట నుంచుకొనియున్నాను నీ సత్యము ననుసరించి నడుచుకొనుచున్నాను

కీర్తనలు 68:5 తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేనివారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు

కీర్తనలు 85:13 నీతి ఆయనకుముందు నడచును ఆయన అడుగుజాడలలో అది నడచును.

కీర్తనలు 112:4 యథార్థవంతులకు చీకటిలో వెలుగుపుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు.

సామెతలు 3:3 దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము.

సామెతలు 16:32 పరాక్రమశాలికంటె దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీనపరచుకొనువాడు శ్రేష్ఠుడు

సామెతలు 19:11 ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.

సామెతలు 20:3 కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును.

ఆమోసు 1:11 యెహోవా సెలవిచ్చునదేమనగా ఎదోము మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని యెడతెగని కోపముతో తనకు సహోదరులగు వారిని మానక చీల్చుచువచ్చెను.

మత్తయి 5:7 కనికరము గలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.

మత్తయి 5:9 సమాధాన పరచువారు ధన్యులు ? వారు దేవుని కుమారులనబడుదురు.

మత్తయి 18:22 అందుకు యేసు అతనితో ఇట్లనెను ఏడు మారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను.

మత్తయి 18:33 నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా అని వానితో చెప్పెను.

యోహాను 10:4 మరియు అతడు తన సొంత గొఱ్ఱలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును.

యోహాను 12:26 ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును.

అపోస్తలులకార్యములు 26:20 మొదట దమస్కులోనివారికిని, యెరూషలేములోను యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును, వారు మారుమనస్సు పొంది దేవునితట్టు తిరిగి మారుమనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని.

1కొరిందీయులకు 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.

గలతీయులకు 3:26 యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులై యున్నారు.

గలతీయులకు 5:22 అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.

ఫిలిప్పీయులకు 2:15 సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి.

కొలొస్సయులకు 2:6 కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు,

కొలొస్సయులకు 3:15 క్రీస్తు అను గ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి.

1దెస్సలోనీకయులకు 1:6 పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి.

1దెస్సలోనీకయులకు 4:9 సహోదర ప్రేమనుగూర్చి మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకని నొకడు ప్రేమించుటకు దేవునిచేతనే నేర్పబడితిరి.

1దెస్సలోనీకయులకు 5:14 సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘశాంతము గలవారై యుండుడి.

2తిమోతి 2:19 అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. ప్రభువు తనవారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను అనునది

1పేతురు 3:8 తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.

1పేతురు 3:13 మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు?

1యోహాను 2:8 మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే.

1యోహాను 3:10 దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు.

3యోహాను 1:11 ప్రియుడా, చెడుకార్యమును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు.