Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 8 వచనము 9

ద్వితియోపదేశాకాండము 33:25 నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై యుండును. నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును.

యెహోషువ 22:8 మీరు మిక్కిలి కలిమిగలవారై అతి విస్తారమైన పశువులతోను వెండితోను బంగారుతోను ఇత్తడితోను ఇనుముతోను అతివిస్తారమైన వస్త్రము లతోను తిరిగి మీ నివాసములకు వెళ్లుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులును కలిసి పంచుకొనుడి.

1దినవృత్తాంతములు 22:14 ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు రెండులక్షల మణుగుల బంగారమును పదికోట్ల మణుగుల వెండిని తూచ శక్యముకానంత విస్తారమైన యిత్తడిని యినుమును సమకూర్చియున్నాను; మ్రానులను రాళ్లను కూర్చి యుంచితిని; నీవు ఇంకను సంపాదించుదువుగాక.

యోబు 28:2 ఇనుమును మంటిలోనుండి తీయుదురు రాళ్లు కరగించి రాగి తీయుదురు.

ఆదికాండము 4:22 మరియు సిల్లా తూబల్కయీనును కనెను. అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు. తూబల్కయీను సహోదరి పేరు నయమా.

నిర్గమకాండము 25:3 మీరు వారియొద్ద తీసికొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి,

యెహెజ్కేలు 19:10 మరియు నీకు క్షేమము కలిగియుండగా నీ తల్లి ఫలభరితమై తీగెలతో నిండియుండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లివలె నుండెను.