Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 13 వచనము 4

ద్వితియోపదేశాకాండము 6:13 నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను.

2రాజులు 23:3 రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గములయందు నడచి, ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను గైకొని, యీ గ్రంథమందు వ్రాయబడియున్న నిబంధన సంబంధమైన మాటలన్నిటిని స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరు ఆ నిబంధనకు సమ్మతించిరి.

2దినవృత్తాంతములు 34:31 పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి నేను యెహోవాను అనుసరించుచు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణమనస్సుతోను పూర్ణహృదయముతోను గైకొనుచు, ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసికొనెను.

మీకా 6:8 మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.

లూకా 1:6 వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి.

కొలొస్సయులకు 1:10 ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధిపొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు,

1దెస్సలోనీకయులకు 4:1 మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు.

1దెస్సలోనీకయులకు 4:2 కాగా మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మావలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము.

యిర్మియా 7:23 ఏదనగానా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనైయుందును మీరు నాకు జనులైయుందురు; మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞాపించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి.

ద్వితియోపదేశాకాండము 10:20 నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను.

ద్వితియోపదేశాకాండము 30:20 నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును మూలమైయున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి.

రోమీయులకు 6:13 మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి.

1కొరిందీయులకు 6:17 అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు.

ఆదికాండము 5:22 హనోకు మెతూషెలను కనిన తరువాత మూడువందల యేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.

నిర్గమకాండము 23:25 నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్యనుండి రోగము తొలగించెదను.

లేవీయకాండము 26:46 యెహోవా మోషే ద్వారా సీనాయి కొండమీద తనకును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలును తీర్పులును ఆజ్ఞలును ఇవే.

ద్వితియోపదేశాకాండము 4:4 మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరును నేటివరకు సజీవులై యున్నారు.

ద్వితియోపదేశాకాండము 6:2 నీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలన్నియు ఆజ్ఞలన్నియు నీ జీవితదినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్లుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే.

ద్వితియోపదేశాకాండము 26:16 ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించియున్నాడు గనుక నీవు నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను వాటిననుసరించి నడుచుకొనవలెను.

ద్వితియోపదేశాకాండము 26:17 యెహోవాయే నీకు దేవుడైయున్నాడనియు, నీవు ఆయన మార్గములయందు నడిచి, ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి, ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట యిచ్చితివి.

యెహోషువ 22:5 అయితే మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు, ఆయనమార్గములన్ని టిలో నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు, యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్ర మును అనుసరించి నడుచుకొనుడి.

యెహోషువ 23:8 మీరు నేటివరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని యుండవలెను.

1సమూయేలు 7:3 సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను మీ పూర్ణహృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్లుకొనినయెడల, అన్యదేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్యనుండి తీసివేసి, పట్టుదలగలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మును విడిపించును.