Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 21 వచనము 14

నిర్గమకాండము 21:7 ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మినయెడల దాసులైన పురుషులు వెళ్లిపోవునట్లు అది వెళ్లిపోకూడదు.

నిర్గమకాండము 21:8 దానిని ప్రధానము చేసికొనిన యజమానుని దృష్టికి అది యిష్టురాలు కానియెడల అది విడిపింపబడునట్లు అవకాశము నియ్యవలెను; దాని వంచించినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు.

నిర్గమకాండము 21:9 తన కుమారునికి దాని ప్రధానము చేసినయెడల కుమార్తెల విషయమైన న్యాయవిధినిబట్టి దానియెడల జరిగింపవలెను.

నిర్గమకాండము 21:10 ఆ కుమారుడు వేరొక దాని చేర్చుకొనినను, మొదటిదానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు.

నిర్గమకాండము 21:11 ఈ మూడును దానికి కలుగజేయనియెడల అది ఏమియు ఇయ్యక స్వతంత్రురాలై పోవచ్చును.

ద్వితియోపదేశాకాండము 22:19 ఆ చిన్నదాని తండ్రికియ్యవలెను. ఏలయనగా అతడు ఇశ్రాయేలీయురాలైన కన్యకను అవమానపరచియున్నాడు. అప్పుడామె అతనికి భార్యయై యుండును; అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆమెను విడువకూడదు.

ద్వితియోపదేశాకాండము 22:24 ఆ ఊరి గవినియొద్దకు వారిద్దరిని తీసికొనివచ్చి, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను, తన పొరుగువాని భార్యను అవమానపరచినందున ఆ మనుష్యుని, రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును మీలోనుండి పరిహరించుదురు.

ద్వితియోపదేశాకాండము 22:29 ఆమెతో శయనించినవాడు ఆ చిన్నదాని తండ్రికి ఏబది వెండిరూకలిచ్చి ఆమెను పెండ్లిచేసికొనవలెను. అతడు ఆమెను ఆవమానపరచెను గనుక అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆమెను విడిచిపెట్టకూడదు.

ఆదికాండము 34:2 ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను.

న్యాయాధిపతులు 19:24 ఇదిగో కన్యకయైన నా కుమార్తెయును ఆ మనుష్యుని ఉప పత్నియు నున్నారు. నేను వారిని బయటికి తీసికొని వచ్చెదను, మీరు వారిని నీచపరచి మీ యిష్టప్రకారముగా వారియెడల జరిగింపవచ్చునుగాని యీ మనుష్యునియెడల ఈ వెఱ్ఱిపని చేయకుడని వారితో చెప్పెనుగాని

ఎస్తేరు 2:14 సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్లి మరుదినము ఉపపత్నులను కాయు రాజుయొక్క షండుడైన షయష్గజు అను అతని వశములోనున్న రెండవ అంతఃపురమునకు తిరిగివచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరుపెట్టి పిలిచితేనే గాని ఆమె రాజునొద్దకు మరల వెళ్లకుండెను.