Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 29 వచనము 24

1రాజులు 9:8 ఈ మందిరమార్గమున వచ్చువారందరును దానిచూచి, ఆశ్చర్యపడి ఇసీ, యని యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఈలాగున ఎందుకు చేసెనని యడుగగా

1రాజులు 9:9 జనులిట్లందురు ఐగుప్తు దేశములోనుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి యితర దేవతలను ఆధారము చేసికొని కొలిచి పూజించుచు వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారిమీదికి రప్పించియున్నాడు.

2దినవృత్తాంతములు 7:21 అప్పుడు ప్రఖ్యాతి నొందిన యీ మందిరమార్గమున పోవు ప్రయాణస్థులందరును విస్మయమొంది యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారముగా చేసెనని యడుగగా

2దినవృత్తాంతములు 7:22 జనులు ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశమునుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి యితర దేవతలను అనుసరించి వాటికి పూజానమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారిమీదికి రప్పించెనని ప్రత్యుత్తరమిచ్చెదరు.

యిర్మియా 22:8 అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవుచు యెహోవా యెందు నిమిత్తము ఈ గొప్ప పట్టణమును ఈలాగు చేసెనని యొకనినొకడు అడుగగా

యిర్మియా 22:9 అచ్చటి వారు వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్యదేవతలను పూజించి వాటికి నమస్కారము చేసినందున ఆయన ఈలాగున చేసియున్నాడని చెప్పుదురు.

విలాపవాక్యములు 2:15 త్రోవను వెళ్లువారందరు నిన్నుచూచి చప్పట్లుకొట్టెదరు వారు యెరూషలేముకుమారిని చూచి పరిపూర్ణ సౌందర్యముగల పట్టణమనియు సర్వ భూనివాసులకు ఆనందకరమైన నగరియనియు జనులు ఈ పట్టణమునుగూర్చియేనా చెప్పిరి? అని యనుకొనుచు గేలిచేసి తల ఊచెదరు

విలాపవాక్యములు 2:16 నీ శత్రువులందరు నిన్నుచూచి నోరుతెరచెదరు వారు ఎగతాళిచేసి పండ్లుకొరుకుచు దాని మింగివేసియున్నాము ఇదేగదా మనము కనిపెట్టిన దినము అది తటస్థించెను, దాని మనము చూచియున్నాము అని యనుకొనెదరు.

విలాపవాక్యములు 2:17 యెహోవా తాను యోచించిన కార్యము ముగించియున్నాడు పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చియున్నాడు శేషములేకుండ నిన్ను పాడుచేసియున్నాడు నిన్నుబట్టి శత్రువులు సంతోషించునట్లు చేసియున్నాడు నీ పగవారి శృంగమును హెచ్చించియున్నాడు.

విలాపవాక్యములు 4:12 బాధించువాడుగాని విరోధిగాని యెరూషలేము గవునులలోనికి వచ్చునని భూరాజులకైనను లోకనివాసులందరిలో మరి ఎవరికైనను తోచియుండలేదు.

యెహెజ్కేలు 14:23 మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసినదంతయు నిర్హేతుకముగా చేయలేదని మీరు తెలిసికొని ఓదార్పు నొందుదురు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

రోమీయులకు 2:5 నీ కాఠిన్యమును, మార్పుపొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు.

నిర్గమకాండము 11:8 అప్పుడు నీ సేవకులైన వీరందరు నాయొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి నీవును, నిన్ను ఆశ్రయించియున్న యీ ప్రజలందరును బయలువెళ్లుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్లుదుననెను. మోషే ఆలాగు చెప్పి ఫరోయెద్దనుండి అత్యాగ్రహముతో వెళ్లిపోయెను

లేవీయకాండము 26:32 నేనే మీ దేశమును పాడుచేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు.

ద్వితియోపదేశాకాండము 31:17 కావున నా కోపము ఆ దినమున వారిమీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు, మన దేవుడు మన మధ్య నుండకపోయినందున గదా యీ కీడులు మనకు ప్రాప్తించెననుకొందురు.

న్యాయాధిపతులు 6:13 గిద్యోనుచిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవిం చెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏ మాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయులచేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను.

న్యాయాధిపతులు 21:3 యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నేడు ఇశ్రాయేలీయులలో ఒక గోత్రము లేకపోయెను. ఇది ఇశ్రాయేలీయులకు సంభ వింపనేల అని బహుగా ఏడ్చిరి.

1సమూయేలు 4:3 కాబట్టి జనులు పాళెములోనికి తిరిగిరాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులో నున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసికొని మన మధ్య నుంచుకొందము రండి; అది మన మధ్య నుండినయెడల అది మన శత్రువుల చేతిలోనుండి మనలను రక్షించుననిరి.

1రాజులు 14:15 ఇశ్రాయేలువారు దేవతా స్తంభములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించియున్నారు గనుక నీటియందు రెల్లు అల్లలాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి, ఒకడు వేరును పెల్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన యీ మంచిదేశములోనుండి వారిని పెల్లగించి వారిని యూఫ్రటీసునది అవతలకు చెదరగొట్టును.

2రాజులు 18:12 అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశములోనికి తీసికొనిపోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను పట్టణములలోను మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను.

2రాజులు 22:17 ఈ జనులు నన్ను విడిచి యితరదేవతలకు ధూపము వేయుచు, తమ సకల కార్యములచేత నాకు కోపము పుట్టించియున్నారు గనుక నా కోపము ఆరిపోకుండ ఈ స్థలముమీద రగులుకొనుచున్నది.

2దినవృత్తాంతములు 6:36 పాపము చేయనివాడెవడును లేడు గనుక వారు నీ దృష్టి యెదుట పాపము చేసినప్పుడు నీవు వారిమీద ఆగ్రహించి, శత్రువులచేతికి వారిని అప్పగింపగా, చెరపట్టువారు వారిని దూరమైనట్టి గాని సమీపమైనట్టి గాని తమ దేశములకు పట్టుకొనిపోగా

2దినవృత్తాంతములు 28:6 రెమల్యా కుమారుడైన పెకహు యూదావారిలో పరాక్రమశాలులైన లక్ష ఇరువది వేలమందిని ఒక్కనాడు హతముచేసెను. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికిట్టిగతి పట్టెను.

ఎజ్రా 5:12 మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరను బబులోను రాజుచేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనముచేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకొని పోయెను.

యోబు 18:20 తర్వాత వచ్చినవారు వారిమీద పడిన శిక్షనుచూచి విస్మయమొందుదురు పూర్వముండినవారు దానిని చూచి దిగులుపడుదురు.

కీర్తనలు 18:8 ఆయన నాసికారంధ్రములనుండి పొగ పుట్టెను ఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెను

యెషయా 23:8 దాని వర్తకులు రాజసమానులు దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు కిరీటముల నిచ్చుచుండు తూరుకు ఈలాగు చేయనెవడు ఉద్దేశించెను?

యిర్మియా 5:19 మన దేవుడైన యెహోవా దేనినిబట్టి ఇవన్నియు మాకు చేసెనని వారడుగగా నీవు వారితో ఈలాగనుము మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్యదేవతలను కొలిచినందుకు, మీదికాని దేశములో మీరు అన్యులను కొలిచెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యిర్మియా 6:18 అయితే మేము వినమని వారనుచున్నారు; అన్యజనులారా, వినుడి; సంఘమా, వారికి జరిగినదానిని తెలిసికొనుము.

యిర్మియా 16:10 నీవు ఈ మాటలన్నియు ఈ ప్రజలకు తెలియజెప్పిన తరువాత వారు దేనిబట్టి యెహోవా మాకు ఈ ఘోరబాధ అంతయు నియమించెను? మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి? మా పాపమేమి? అని నిన్నడుగగా

యిర్మియా 40:2 రాజదేహసంరక్షకుల కధిపతి యిర్మీయాను అవతలికి తీసికొపోయి అతనితో ఈలాగు మాటలాడెను ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసెదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించెను గదా.

యెహెజ్కేలు 5:15 కావున నీ పోషణాధారము తీసివేసి, నీమీదికి నేను మహా క్షామము రప్పించి, నీవారు క్షయమగునట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును పంపించి, కోపముచేతను క్రోధముచేతను కఠినమైన గద్దింపులచేతను నేను నిన్ను శిక్షింపగా

యెహెజ్కేలు 12:16 అయితే నేను యెహోవానై యున్నానని అన్యజనులు తెలిసికొనునట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయకృత్యములన్నిటిని వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గముచేత కూలకుండను క్షామమునకు చావకుండను తెగులు తగులకుండను నేను వారిలో కొందరిని తప్పించెదను.

యెహెజ్కేలు 20:48 అది ఆరిపోకుండ యెహోవానైన నేను దానిని రాజబెట్టితినని సమస్తమైన జనులకు తెలియబడును.

యెహెజ్కేలు 21:5 యెహోవానైన నేను నా ఖడ్గము మరల ఒరలోపడకుండ దాని దూసియున్నానని జనులందరు తెలిసికొందురు.

యెహెజ్కేలు 22:4 నీకు నీవే శిక్ష తెప్పించుకొంటివి, శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతివి. కాబట్టి అన్యజనములలో నిందాస్పదముగాను, సకలదేశములలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియమించుచున్నాను.

యెహెజ్కేలు 32:10 నా ఖడ్గమును నేను వారిమీద ఝళిపించెదను, నిన్నుబట్టి చాలమంది జనులు కలవరించుదురు, వారి రాజులును నిన్నుబట్టి భీతులగుదురు, నీవు కూలు దినమున వారందరును ఎడతెగక ప్రాణభయముచేత వణకుదురు.

ఆమోసు 3:9 అష్డోదు నగరులలో ప్రకటన చేయుడి, ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయుడి; ఎట్లనగా--మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతములమీదికి కూడివచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి; అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి.