Logo

1పేతురు అధ్యాయము 2 వచనము 11

హోషేయ 1:9 యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై యుండను గనుక లోఅమ్మీమ (నాజనము కాదని) యితనికి పేరు పెట్టుము.

హోషేయ 1:10 ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును; ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవముగల దేవుని కుమారులైయున్నారని వారితో చెప్పుదురు.

రోమీయులకు 9:25 ఆ ప్రకారము నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు, పేరు పెట్టుదును.

రోమీయులకు 9:26 మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని యేచోటను వారితో చెప్పబడెనో, ఆ చోటనే జీవముగల దేవుని కుమారులని వారికి పేరుపెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు.

హోషేయ 2:23 నేను దానిని భూమియందు నాకొరకై విత్తుదును; జాలి నొందని దానియందు నేను జాలి చేసికొందును; నా జనము కానివారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని యందురు; ఇదే యెహోవా వాక్కు.

రోమీయులకు 11:6 అది కృపచేతనైనయెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును.

రోమీయులకు 11:7 ఆలాగైన ఏమగును?ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందినవారికి అది దొరికెను; తక్కినవారు కఠినచిత్తులైరి.

రోమీయులకు 11:30 మీరు గతకాలమందు దేవునికి అవిధేయులైయుండి, యిప్పుడు వారి అవిధేయతనుబట్టి కరుణింపబడితిరి.

1కొరిందీయులకు 7:25 కన్యకల విషయమై, ప్రభువుయొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైనవాడనై యుండుటకు ప్రభువు వలన కనికరము పొందినవాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను.

1తిమోతి 1:13 నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తుయేసుకు కృతజ్ఞుడనై యున్నాను. తెలియక అవిశ్వాసమువలన చేసితిని గనుక కనికరింపబడితిని.

హెబ్రీయులకు 4:16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము.

నిర్గమకాండము 6:7 మిమ్మును నాకు ప్రజలగా చేర్చుకొని మీకు దేవుడనైయుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రిందనుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురు.

లేవీయకాండము 14:14 అప్పుడు యాజకుడు అపరాధపరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలిమీదను, వాని కుడికాలి బొటనవ్రేలిమీదను, దానిని చమరవలెను.

సంఖ్యాకాండము 15:41 నేను మీకు దేవుడనై యుండునట్లుగా ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను; మీ దేవుడనైన యెహోవాను నేనే.

ద్వితియోపదేశాకాండము 27:9 మరియు మోషేయు యాజకులైన లేవీయులును ఇశ్రాయేలీయులందరితో ఇట్లనిరి ఇశ్రాయేలీయులారా, మీరు ఊరకొని ఆలకించుడి.

ద్వితియోపదేశాకాండము 32:9 యెహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్యభాగము యాకోబే.

ద్వితియోపదేశాకాండము 32:21 వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టించిరి తమ వ్యర్థ ప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనముకాని వారివలన వారికి రోషము పుట్టింతును అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును.

2సమూయేలు 7:24 మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవైయుండి, వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరుగల జనులై యుండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి.

కీర్తనలు 18:43 ప్రజలు చేయు కలహములలో పడకుండ నీవు నన్ను విడిపించితివి నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు

కీర్తనలు 102:18 యెహోవాను సేవించుటకై జనములును రాజ్యములును కూర్చబడునప్పుడు

కీర్తనలు 118:2 ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురు గాక.

కీర్తనలు 145:7 నీ మహా దయాళుత్వమునుగూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతినిగూర్చి వారు గానము చేసెదరు

కీర్తనలు 147:20 ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి. యెహోవాను స్తుతించుడి.

పరమగీతము 4:16 ఉత్తర వాయువూ, ఏతెంచుము దక్షిణ వాయువూ, వేంచేయుము నా ఉద్యానవనముమీద విసరుడి దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక తనకిష్టమైన ఫలములనతడు భుజించునుగాక.

యెషయా 19:25 సైన్యములకధిపతియగు యెహోవా నా జనమైన ఐగుప్తీయులారా, నాచేతుల పనియైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును.

యెషయా 35:8 అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పకయుందురు

యెషయా 55:13 ముండ్లచెట్లకు బదులుగా దేవదారువృక్షములు మొలుచును దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదుగును అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును.

యెషయా 62:4 విడువబడినదానివని ఇకమీదట నీవనబడవు పాడైనదని ఇకను నీ దేశమునుగూర్చి చెప్పబడదు హెప్సీబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును. యెహోవా నిన్నుగూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును.

యెషయా 65:1 నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను.

యెషయా 65:15 నేనేర్పరచుకొనినవారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయెదరు ప్రభువగు యెహోవా నిన్ను హతము చేయును ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును.

యిర్మియా 17:26 మరియు జనులు దహనబలులను బలులను నైవేద్యములను ధూపద్రవ్యములను తీసికొని యూదా పట్టణములలోనుండియు, యెరూషలేము ప్రాంతములలోనుండియు, బెన్యామీను దేశములోనుండియు, మైదానపు దేశములోనుండియు, మన్యములోనుండియు, దక్షిణదేశములోనుండియు వచ్చెదరు; యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసికొనివచ్చెదరు.

దానియేలు 4:37 ఈలాగు నెబుకద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్యములును, ఆయన మార్గములు న్యాయములునై యున్నవనియు, గర్వముతో నటించువారిని ఆయన అణపశక్తుడనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచు నున్నాను.

హోషేయ 1:6 పిమ్మట ఆమె మరల గర్భవతియై కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరూహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము; ఇకమీదట నేను ఇశ్రాయేలువారిని క్షమించను, వారియెడల జాలిపడను.

హోషేయ 2:1 మీరు నా జనులని మీ సహోదరులతోను జాలి నొందినవారని మీ స్వదేశీయులతోను మీరు చెప్పుడి.

జెకర్యా 2:11 ఆ దినమున అన్యజనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసముచేతును; అప్పుడు యెహోవా నన్ను మీయొద్దకు పంపియున్నాడని మీరు తెలిసికొందురు.

మత్తయి 5:7 కనికరము గలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.

మత్తయి 28:20 నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.

లూకా 15:6 మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొఱ్ఱ దొరకినదని వారితో చెప్పును గదా.

లూకా 19:9 అందుకు యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది.

యోహాను 10:16 ఈ దొడ్డివి కాని వేరే గొఱ్ఱలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱల కాపరి ఒక్కడును అగును.

యోహాను 12:23 అందుకు యేసు వారితో ఇట్లనెను మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది.

అపోస్తలులకార్యములు 15:14 అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమెయోను వివరించియున్నాడు.

అపోస్తలులకార్యములు 27:23 నేను ఎవనివాడనో, యెవనిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడచిన రాత్రి నాయొద్ద నిలిచి పౌలా, భయపడకుము;

రోమీయులకు 1:5 యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను.

రోమీయులకు 4:17 తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియై యున్నాడు ఇందునుగూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.

రోమీయులకు 9:16 కాగా పొందగోరువానివలననైనను, ప్రయాసపడువానివలననైనను కాదు గాని, కరుణించు దేవునివలననే అగును.

రోమీయులకు 10:19 మరియు నేను చెప్పునదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుండెనా?జనము కానివారివలన మీకు రోషము పుట్టించెదను, అవివేకమైన జనమువలన మీకు ఆగ్రహము కలుగజేతును. అని మొదట మోషే చెప్పుచున్నాడు.

రోమీయులకు 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.

రోమీయులకు 15:8 నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమునుగూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతిగలవారికి పరిచారకుడాయెను.

2కొరిందీయులకు 4:1 కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడినవారమై అధైర్యపడము.

2కొరిందీయులకు 6:14 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?

ఎఫెసీయులకు 1:13 మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.

ఎఫెసీయులకు 2:3 వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.

1దెస్సలోనీకయులకు 5:4 సహోదరులారా, ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు.

1దెస్సలోనీకయులకు 5:9 ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు.

2తిమోతి 2:10 అందుచేత ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతో కూడ క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారికొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను.

తీతుకు 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.

ఫిలేమోనుకు 1:11 అతడు మునుపు నీకు నిష్‌ప్రయోజనమైనవాడే గాని, యిప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైనవాడాయెను.

హెబ్రీయులకు 4:9 కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది.

హెబ్రీయులకు 11:25 అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి,