లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 10: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఫిలిష్తీయులు సౌలునకు చేసినదంతయు యాబేష్గిలాదువారు వినినప్పుడు పరాక్రమశాలులైన వారందరును లేచిపోయి,"

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 11:1

అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాదు కెదురుగా దిగినప్పుడు యాబేషు వారందరు మేము నీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయుమని నాహాషుతో అనిరి

1సమూయేలు 11:2

ఇశ్రాయేలీయులందరి మీదికి నింద తెచ్చునట్లు మీయందరి కుడికన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసెదనని అమ్మోనీయుడైన నాహాషు

1సమూయేలు 11:3

యాబేషు వారి పెద్దలతో చెప్పగా వారు మేము ఇశ్రాయేలీయుల సరిహద్దులన్నిటికి దూతలను పంపుటకై యేడు దినముల గడువు మాకిమ్ము; మమ్మును రక్షించుటకు ఎవరును లేకపోయినయెడల మమ్మును మేము నీకప్పగించుకొనెదమనిరి.

1సమూయేలు 11:4

దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా జనులందరు బిగ్గరగా ఏడ్చిరి.

1సమూయేలు 11:5

సౌలు పొలమునుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగగా వారు యాబేషువారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి.

1సమూయేలు 11:6

సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై

1సమూయేలు 11:7

ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశములోని నలుదిక్కులకు దూతలచేత వాటిని పంపి సౌలుతోను సమూయేలుతోను చేరకుండువాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనులమీదికి వచ్చెను గనుక యొకడైనను నిలువకుండ వారందరు వచ్చిరి.

1సమూయేలు 11:8

అతడు బెజెకులో వారిని లెక్కపెట్టగా ఇశ్రాయేలువారు మూడు లక్షలమందియు యూదావారు ముప్పదివేల మందియు అయిరి.

1సమూయేలు 11:9

అప్పుడు రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపివేసెను. దూతలు పోయి యాబేషువారికి ఆ వర్తమానము తెలుపగా వారు సంతోషపడిరి.

1సమూయేలు 11:10

కాబట్టి యాబేషువారు నాహాషు యొక్క దూతలతో ఇట్లనిరి రేపు మేము బయలుదేరి మమ్మును అప్పగించుకొందుము, అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును.

1సమూయేలు 11:11

మరునాడు సౌలు జనులను మూడు సమూహములుగా చేసిన తరువాత వారు తెల్లవారు సమయమున దండుమధ్యను జొచ్చి మధ్యాహ్నములోగా అమ్మోనీయులను హతముచేయగా వారిలో మిగిలినవారు ఇద్దరేసికూడి పోజాలకుండ చెదరిపోయిరి.

1సమూయేలు 31:11

అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసినదాని గురించిన వార్త యాబేష్గిలాదు వారు విని

1సమూయేలు 31:12

బలశాలులందరు లేచి రాత్రియంత నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బేత్షాను పట్టణపు గోడమీదనుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనముచేసి

1సమూయేలు 31:13

వారి శల్యములను తీసి యాబేషులోని పిచులవృక్షము క్రింద పాతిపెట్టి యేడుదినములు ఉపవాసముండిరి.

2సమూయేలు 2:4

అంతట యూదావారు అక్కడికి వచ్చి యూదావారిమీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి.

2సమూయేలు 2:5

సౌలును పాతిపెట్టినవారు యాబేష్గిలాదువారని దావీదు తెలిసికొని యాబేష్గిలాదువారియొద్దకు దూతలను పంపి మీరు ఉపకారము చూపి మీ యేలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురు గాక.

2సమూయేలు 2:6

యెహోవా మీకు కృపను సత్యస్వభావమును అగపరచును, నేనును మీరు చేసిన యీ క్రియనుబట్టి మీకు ప్రత్యుపకారము చేసెదను.

2సమూయేలు 2:7

మీ యజమానుడగు సౌలు మృతినొందెను గాని యూదావారు నాకు తమమీద రాజుగా పట్టాభిషేకము చేసియున్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై యుండుడని ఆజ్ఞనిచ్చెను.