1దినవృత్తాంతములు 10: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" జనులు పారిపోయిరనియు, సౌలును అతని కుమారులును చనిపోయిరనియు, లోయలోని ఇశ్రాయేలీయులందరు తెలిసికొని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
నా మనస్సు మీయందు అసహ్యపడును, నేను మీ పట్టణములను పాడుచేసెదను; మీ పరిశుద్ధస్థలములను పాడుచేసెదను; మీ సువాసనగల వాటి సువాసనను ఆఘ్రాణింపను.
మీలో మిగిలినవారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెదను; కొట్టుకొనిపోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుటనుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయెదరు; తరుమువాడు లేకయే పడెదరు.
నీవెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు.
నీ మధ్యనున్న పరదేశి నీకంటె మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోదువు.
మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయులయెదుట నిలువలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి.
ఇశ్రాయేలీయులు దిగులుపడుచు వచ్చి తాము ఇరుకులో నున్నట్టు తెలిసికొని గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నత స్థలములలోను కూపములలోను దాగిరి.
లోయ అవతలనున్న ఇశ్రాయేలీయులును, యొర్దాను అవతల నున్నవారును, ఇశ్రాయేలీయులు పారిపోవుటయు, సౌలును అతని కుమారులును చచ్చియుండుటయు చూచి తమ నివాసగ్రామములు విడిచిపెట్టి పారిపోయిరి. ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి.
ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవావలన కలిగినయెడల ఇశ్రాయేలీయుల నివాసప్రదేశముల యందంతట శేషించియున్న మన సహోదరులును తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులును లేవీయులును మనతో కూడుకొనునట్లు వారియొద్దకు పంపి