లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 18: 2

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు మోయాబీయులను జయించగా వారు దావీదునకు కప్పముకట్టు దాసులైరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 24:17

ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరిని నాశనము చేయును.

న్యాయాధిపతులు 3:29

ఆ కాలమున వారు మోయాబీయు లలో బలముగల శూరులైన పరాక్రమ శాలులను పదివేల మందిని చంపిరి; ఒకడును తప్పించుకొనలేదు. ఆ దిన మున మోయాబీయులు ఇశ్రాయేలీయులచేతిక్రింద అణపబడగా దేశము ఎనుబది సంవత్సరములు నిమ్మళముగా ఉండెను.

న్యాయాధిపతులు 3:30

అతనితరువాత అనాతు కుమారుడైన షవ్గురు న్యాయాధి పతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో ఆరువందల మందిని మునుకోల కఱ్ఱతో హతముచేసెను; అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను.

2సమూయేలు 8:2

మరియు అతడు మోయాబీయులను ఓడించి, (పట్టుబడిన వారిని) నేలపొడుగున పండజేసి, తాడుతో కొలిచి రెండు తాడుల పొడుగుననున్నవారు చావవలెననియు, ఒకతాడు పొడుగుననున్నవారు బ్రతుకవచ్చుననియు నిర్ణయించెను. అంతట మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి.

కీర్తనలు 60:8

మోయాబు నేను కాళ్లు కడుగుకొను పళ్లెము ఎదోముమీద నా చెప్పు విసరివేయుదును ఫిలిష్తియా, నన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయుము.

యెషయా 11:14

వారు ఫిలిష్తీయుల భుజముమీద ఎక్కుదురు పడమటివైపుకు పరుగెత్తిపోవుదురు ఏకీభవించి తూర్పువారిని దోచుకొందురు ఎదోమును మోయాబును ఆక్రమించుకొందురు అమ్మోనీయులు వారికి లోబడుదురు

1సమూయేలు 10:27

పనికిమాలినవారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఏలాగు రక్షింపగలడని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసికొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను.

1రాజులు 10:2

ఆమె గొప్ప పరివారముతో, గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనముచేసి తనకు తోచినదాని నంతటినిబట్టి అతనితో మాటలాడగా

1రాజులు 10:25

ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని, బంగారపు వస్తువులు గాని, వస్త్రములు గాని, యుద్ధాయుధములు గాని, గంధవర్గములు గాని, గుఱ్ఱములు గాని, కంచరగాడిదలు గాని, తన తన వంతుచొప్పున కట్నములను ఏటేట తీసికొని వచ్చుచుండెను.

2రాజులు 3:4

మోయాబు రాజైన మేషా అనేకమైన మందలు గలవాడై లక్ష గొఱ్ఱపిల్లలను బొచ్చుగల లక్ష గొఱ్ఱపొట్టేళ్లను ఇశ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు.

2రాజులు 3:5

అయితే అహాబు మరణమైన తరువాత మోయాబు రాజు ఇశ్రాయేలు రాజుమీద తిరుగుబాటు చేయగా

కీర్తనలు 68:29

యెరూషలేములోని నీ ఆలయమునుబట్టి రాజులు నీయొద్దకు కానుకలు తెచ్చెదరు.

కీర్తనలు 68:30

రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడలవంటి జనములును లొంగి, వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము కలహప్రియులను ఆయన చెదరగొట్టియున్నాడు.

కీర్తనలు 72:8

సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతములవరకు అతడు రాజ్యము చేయును.

కీర్తనలు 72:9

అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు.

కీర్తనలు 72:10

తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు షేబ రాజులును సెబా రాజులును కానుకలు తీసికొనివచ్చెదరు.

యెషయా 16:1

అరణ్యపు తట్టుననున్న సెలనుండి దేశము నేలువానికి తగిన గొఱ్ఱపిల్లలను కప్పముగా సీయోనుకుమార్తె పర్వతమునకు పంపుడి

2రాజులు 1:1

అహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలువారిమీద తిరుగబడిరి.

1దినవృత్తాంతములు 18:6

తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను; సిరియనులు దావీదునకు కప్పముకట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతనికి సహాయము చేయుచు వచ్చెను.