లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 3: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" మనష్షేకు ఆమోను కుమారుడు, ఆమోనునకు యోషీయా కుమారుడు."

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 21:19

ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడై యెరూషలేమునందు రెండు సంవత్సరములు ఏలెను, అతని తల్లి యొట్బయూరివాడగు హారూసు కుమార్తెయైన మెషుల్లెమెతు.

2దినవృత్తాంతములు 33:20

మనష్షే తన పితరులతోకూడ నిద్రించి తన నగరునందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను.

2దినవృత్తాంతములు 33:21

ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్లవాడై యెరూషలేములో రెండు సంవత్సరములు ఏలెను.

2రాజులు 22:1

యోషీయా యేలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యెరూషలేమునందు ముప్పదియొక సంవత్సరములు ఏలెను, అతని తల్లి బొస్కతు ఊరివాడగు అదాయాకు కుమార్తెయైన యెదీదా.

2దినవృత్తాంతములు 34:1

యోషీయా యేలనారంభించినప్పుడు ఎనిమిదేండ్లవాడై యెరూషలేములో ముప్పది యొక సంవత్సరము ఏలెను.

మత్తయి 1:10

హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషీయాను కనెను;

మత్తయి 1:11

యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను.

2రాజులు 23:30

అతని సేవకులు అతని శవమును రథముమీద ఉంచి, మెగిద్దోనుండి యెరూషలేమునకు తీసికొనివచ్చి అతని సమాధియందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును తీసికొని అతనికి పట్టాభిషేకముచేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగానుంచిరి.

2రాజులు 23:34

యోషీయా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రియైన యోషీయాకు మారుగా రాజుగా నియమించి, అతనికి యెహోయాకీమను మారుపేరుపెట్టి యెహోయాహాజు ఐగుప్తు దేశమునకు కొనిపోగా అతడచ్చట మృతిబొందెను.

2దినవృత్తాంతములు 36:5

యెహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడత నడచుటచేత

యిర్మియా 22:18

కావున యోషీయా కుమారుడగు యెహోయాకీమను యూదా రాజునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరీ, అని అతనిగూర్చి అంగలార్చరు; అయ్యో నా యేలినవాడా, అయ్యో, శోభావంతుడా; అని అతనికొరకు అంగలార్చరు.

2రాజులు 24:17

మరియు బబులోను రాజు అతని పినతండ్రియైన మత్తన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను.

2రాజులు 24:18

సిద్కియా యేలనారంభించినప్పుడు ఇరువదియొక సంవత్సరములవాడు; అతడు యెరూషలేమునందు పదకొండు సంవత్సరములు ఏలెను.

2దినవృత్తాంతములు 36:11

సిద్కియా యేలనారంభించినప్పుడు ఇరువది యొకటేండ్లవాడై యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను.

2రాజులు 23:30

అతని సేవకులు అతని శవమును రథముమీద ఉంచి, మెగిద్దోనుండి యెరూషలేమునకు తీసికొనివచ్చి అతని సమాధియందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును తీసికొని అతనికి పట్టాభిషేకముచేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగానుంచిరి.

2దినవృత్తాంతములు 36:1

అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించిరి.

యిర్మియా 22:11

తన తండ్రియైన యోషీయాకు ప్రతిగా ఏలినవాడై యీ స్థలములోనుండి వెళ్లిపోయిన యూదా రాజైన యోషీయా కుమారుడగు షల్లూమునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అతడు ఇక్కడికి తిరిగిరాడు;