1కొరిందీయులకు 14: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందునిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు."
సంబంధిత రిఫరెన్స్‌లు
నేను భాషతో ప్రార్థన చేసినయెడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు.
క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు.
నేను మీ యందరికంటె ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను; అందుకు దేవుని స్తుతించెదను.
అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు.
కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతని కప్పగించుము; అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థనచేయును, నీవు బ్రదుకుదువు. నీవు ఆమెను అతని కప్పగించనియెడల నీవును నీవారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసికొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను.
కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.
మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి.
నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని యెదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు.
సహోదరులారా, యిప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చునప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెననియున్నాడు; మరియొకడు బోధింపవలెననియున్నాడు; మరియొకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలెననియున్నాడు; మరియొకడు భాషతో మాటలాడవలెననియున్నాడు; మరియొకడు అర్థము చెప్పవలెననియున్నాడు. సరే; సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనియ్యుడి.
అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.