లేఖనాలను అన్వేషించండి

1కొరిందీయులకు 7: 37

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఎవడైనను తన కుమార్తెకు పెండ్లి చేయనవసరము లేకయుండి, అతడు స్థిరచిత్తుడును, తన ఇష్టప్రకారము జరుప శక్తిగలవాడునై, ఆమెను వివాహము లేకుండ ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనినయెడల బాగుగా ప్రవర్తించుచున్నాడు."

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 2:33

నా బలిపీఠము నొద్ద నెవడు ఉండకుండ నేనందరిని నశింపజేయక విడుచువాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖముచేత క్షయమగుటకును సాధనమగును; నీ సంతానపు వారందరు వయఃకాలమందు మరణమవుదురు.

1కొరిందీయులకు 7:9

అయితే మనస్సు నిలుపలేనియెడల పెండ్లి చేసికొనవచ్చును; కామతప్తులగుటకంటె పెండ్లి చేసికొనుట మేలు.

1కొరిందీయులకు 7:37

ఎవడైనను తన కుమార్తెకు పెండ్లి చేయనవసరము లేకయుండి, అతడు స్థిరచిత్తుడును, తన ఇష్టప్రకారము జరుప శక్తిగలవాడునై, ఆమెను వివాహము లేకుండ ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనినయెడల బాగుగా ప్రవర్తించుచున్నాడు.

1కొరిందీయులకు 7:28

అయినను నీవు పెండ్లి చేసికొనినను పాపము లేదు, కన్యక పెండ్లి చేసికొనినను ఆమెకు పాపము లేదు; అయితే అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును; అవి మీకు కలుగకుండవలెనని కోరుచున్నాను

ఆదికాండము 2:18

మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను.

యిర్మియా 29:6

పెండ్లిండ్లు చేసికొని కుమారులను కుమార్తెలను కనుడి, అక్కడ ఏమియు మీకు తక్కువలేకుండ అభివృద్ధిపొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిండ్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి.

1కొరిందీయులకు 7:25

కన్యకల విషయమై, ప్రభువుయొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైనవాడనై యుండుటకు ప్రభువు వలన కనికరము పొందినవాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను.

1కొరిందీయులకు 7:35

మీకు ఉరియొడ్డవలెనని కాదుగాని మీరు యోగ్య ప్రవర్తనులై, తొందర యేమియు లేక ప్రభువు సన్నిధానవర్తనులై యుండవలెనని యిది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను.

1కొరిందీయులకు 13:5

అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.

1తిమోతి 4:3

ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షి గలవారై, వివాహము నిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహారవస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు.