లేఖనాలను అన్వేషించండి

1కొరిందీయులకు 7: 39

క్రాస్-రిఫరెన్స్‌లు

" భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలైయుండును, భర్త మృతిపొందినయెడల ఆమె కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలై యుండును గాని ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసికొనవలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1కొరిందీయులకు 7:28

అయినను నీవు పెండ్లి చేసికొనినను పాపము లేదు, కన్యక పెండ్లి చేసికొనినను ఆమెకు పాపము లేదు; అయితే అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును; అవి మీకు కలుగకుండవలెనని కోరుచున్నాను

1కొరిందీయులకు 7:2

అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త యుండవలెను.

హెబ్రీయులకు 13:4

వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.

1కొరిందీయులకు 7:1

మీరు వ్రాసిన వాటి విషయము: స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు.

1కొరిందీయులకు 7:8

నావలెనుండుట వారికి మేలని పెండ్లికానివారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను.

1కొరిందీయులకు 7:26

ఇప్పటి ఇబ్బందినిబట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుండుట మేలని తలంచుచున్నాను.

1కొరిందీయులకు 7:32

మీరు చింత లేనివారై యుండవలెనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచున్నాడు.

1కొరిందీయులకు 7:33

పెండ్లియైనవాడు భార్యను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు.

1కొరిందీయులకు 7:34

అటువలెనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయి యుండుటకు ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచుందురు గాని పెండ్లియైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది

1కొరిందీయులకు 7:37

ఎవడైనను తన కుమార్తెకు పెండ్లి చేయనవసరము లేకయుండి, అతడు స్థిరచిత్తుడును, తన ఇష్టప్రకారము జరుప శక్తిగలవాడునై, ఆమెను వివాహము లేకుండ ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనినయెడల బాగుగా ప్రవర్తించుచున్నాడు.

ఆదికాండము 21:21

అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను.

అపోస్తలులకార్యములు 21:9

కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు.