1రాజులు 14: 30
క్రాస్-రిఫరెన్స్‌లు
" వారు బ్రదికినంత కాలము రెహబామునకును యరొబామునకును యుద్ధము జరుగుచుండెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోవా సెలవిచ్చునదేమనగా జరిగినది నావలననే జరిగెను; మీరు ఇశ్రాయేలువారగు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్లక, అందరును మీ యిండ్లకు తిరిగిపోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానినిబట్టి యుద్ధమునకు పోక నిలిచిరి.
రెహబాము1 బ్రదికిన దినములన్నియు అతనికిని యరొబామునకును యుద్ధము జరుగుచుండెను.
అబీయాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. అబీయామునకును యరొబామునకును యుద్ధము కలిగియుండెను.
రెహబాము చేసిన కార్యములన్నిటినిగూర్చియు షెమయా రచించిన గ్రంథమందును దీర్ఘదర్శియైన ఇద్దో రచించిన వంశావళియందును వ్రాయబడియున్నది.
సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను; సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను.
యరొబాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు జరిగించిన యుద్ధములనుగూర్చియు, ప్రభుత్వమునుగూర్చియు ఇశ్రాయేలువారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
వారు బ్రదికిన దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయెషాకును యుద్ధము జరుగుచుండెను.