లేఖనాలను అన్వేషించండి

1రాజులు 14: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" అంతట యెహోవా అహీయాతో సెలవిచ్చినదేమనగా యరొబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతనిగూర్చి నీచేత విచారించుటకై యరొబాము భార్య వచ్చుచున్నది ఆమె మారువేషము వేసికొని మరియొకతె యైనట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చునట్టు నీవు ఆమెతో చెప్పవలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 4:27

పిమ్మట ఆమె కొండమీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్లు పట్టుకొనెను. గేహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగుచేసెను; ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను.

2రాజులు 6:8

సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచనచేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పెను.

2రాజులు 6:9

అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగియున్నారని తెలియజేసెను గనుక

2రాజులు 6:10

ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలిసికొని తనవారిని రక్షించుకొనెను. ఈలాగు మాటిమాటికి జరుగుచు వచ్చినందున

2రాజులు 6:11

సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారి నడుగగా

2రాజులు 6:12

అతని సేవకులలో ఒకడు రాజవైన నా యేలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరును లేరుగాని ఇశ్రాయేలులో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయుననెను.

కీర్తనలు 139:1

యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొనియున్నావు

కీర్తనలు 139:2

నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.

కీర్తనలు 139:3

నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.

కీర్తనలు 139:4

యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది.

సామెతలు 21:30

యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.

ఆమోసు 3:7

తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.

అపోస్తలులకార్యములు 10:19

పేతురు ఆ దర్శనమునుగూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెదకుచున్నారు.

అపోస్తలులకార్యములు 10:20

నీవు లేచి క్రిందికి దిగి, సందేహింపక వారితో కూడ వెళ్లుము; నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పెను.

1సమూయేలు 28:12

ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి నీవు సౌలువే; నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా

1రాజులు 14:2

యరొబాము తన భార్యతో ఇట్లనెను నీవు లేచి యరొబాము భార్యవని తెలియబడకుండ మారువేషము వేసికొని షిలోహునకు పొమ్ము; ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు.

1రాజులు 14:6

అంతలో అహీయా ద్వారము లోపలికి వచ్చు నామె కాలిచప్పుడు విని ఆమెతో ఇట్లనెను యరొబాము భార్యా, లోపలికి రమ్ము; నీవు వేషము వేసికొని వచ్చుటయేల? కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని నాకు ఆజ్ఞయాయెను.

1రాజులు 14:27

రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి, రాజనగరు ద్వారపాలకులైన తన దేహసంరక్షకుల అధిపతుల వశము చేసెను.

2రాజులు 3:14

ఎలీషా ఇట్లనెను ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదారాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయనియెడల నిన్ను చూచుటకైనను లక్ష్యపెట్టుటకైనను ఒప్పకపోదును.

యిర్మియా 32:7

నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీయొద్దకు వచ్చి అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాని కొనుక్కొనుమని చెప్పును.