1సమూయేలు 10: 14
క్రాస్-రిఫరెన్స్‌లు
" సౌలుయొక్క పినతండ్రి అతనిని అతని పనివానిని చూచి మీరిద్దరు ఎక్కడికి పోతిరని అడుగగా అతడు గార్దభములను వెదకబోతివిు; అవి కనబడకపోగా సమూయేలునొద్దకు పోతిమని చెప్పినప్పుడు"
సంబంధిత రిఫరెన్స్‌లు
సౌలు తండ్రియైన కీషుయొక్క గార్దభములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసులలో ఒకని తీసికొనిపోయి గార్దభములను వెదకుమని చెప్పెను.
అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారము చేసిరి గాని అవి కనబడకయుండెను. బెన్యామీనీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు.
అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్లుదము రమ్ము, గార్దభముల కొరకు చింతింపక, నా తండ్రి మనకొరకు విచారపడునేమోయని సౌలు తనయొద్దనున్న పనివానితో అనగా
వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహు ఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్లవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో అతని యొద్దకు వెళ్లుదము రండని చెప్పెను.
అందుకు సౌలు మనము వెళ్లునెడల ఆ మనిషికి ఏమి తీసికొని పోవుదుము? మన సామగ్రిలోనుండు భోజనపదార్థములు సరిపోయినవి; ఆ దైవజనునికి బహుమానము తీసికొనిపోవుటకు మనకేమియు లేదు అని తన పనివానితో చెప్పి మనయొద్ద ఏమి యున్నదని అడుగగా
వాడు సౌలుతో చిత్తగించుము, నాయొద్ద పావు తులము వెండి కలదు. మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనుని కిత్తుననెను.
ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శియనిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలీయులలో దేవునియొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన యెడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక.
సౌలు నీ మాట మంచిది, వెళ్లుదము రమ్మనగా
అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి గేహజీ, నీవెచ్చటనుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికిని పోలేదనెను.