లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 13: 20

క్రాస్-రిఫరెన్స్‌లు

" కాబట్టి ఇశ్రాయేలీయులందరు తమ నక్కులను పారలను గొడ్డండ్రను పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిష్తీయుల దగ్గరకు పోవలసివచ్చెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 17:10

నీ పగవారినందరిని నేను అణచివేసెదను. అదియు గాక యెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేసితిని.

2దినవృత్తాంతములు 34:6

ఆ ప్రకారము అతడు మనష్షే ఎఫ్రాయిము షిమ్యోను దేశములవారి పట్టణములలోను, నఫ్తాలి మన్యమునందును, చుట్టుపట్లనున్న పాడు స్థలములన్నిటను బలిపీఠములను పడగొట్టెను.

సామెతలు 27:17

ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును.

యిర్మియా 24:1

బబులోనురాజైన నెబుకద్రెజరు యూదారాజైన యెహోయాకీము కుమారుడగు యెకోన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలులను యెరూషలేమునుండి చెరపట్టుకొని బబులోనునకు తీసికొనిపోయిన తరువాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన రెండు గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను.