లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 13: 8

క్రాస్-రిఫరెన్స్‌లు

" సమూయేలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి, సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు, జనులు తనయొద్దనుండి చెదరిపోవుటయు చూచి"

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 10:8

నాకంటె ముందు నీవు గిల్గాలునకు వెళ్లగా, దహనబలులను బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీయొద్దకు దిగివత్తును; నేను నీయొద్దకు వచ్చి నీవు చేయవలసినదానిని నీకు తెలియజేయువరకు ఏడు దినములపాటు నీవు అచ్చట నిలువవలెను.

నిర్గమకాండము 24:14

అతడు పెద్దలను చూచి మేము మీయొద్దకు వచ్చువరకు ఇక్కడనే యుండుడి; ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు; ఎవనికైనను వ్యాజ్యెమున్నయెడల వారియొద్దకు వెళ్లవచ్చునని వారితో చెప్పెను

2సమూయేలు 20:5

అమాశా యూదావారిని సమకూర్చుటకై వెళ్లిపోయెను. అతడు ఆలస్యము చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరిపోయినప్పుడు