1సమూయేలు 15: 33
క్రాస్-రిఫరెన్స్‌లు
" సమూయేలు నీ కత్తి స్త్రీలకు సంతులేకుండ చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో సంతులేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునియలుగా నరికెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నరుని రక్తమును చిందించువాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.
మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి; మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి,
అప్పుడు ఆ కొండమీద నివాసముగానున్న అమాలేకీయులును కనానీయులును దిగివచ్చి వారిని కొట్టి హోర్మావరకు వారిని తరిమి హతముచేసిరి.
అప్పుడు అదోనీ బెజెకుతమ కాళ్లుచేతుల బొట్టనవ్రేళ్లు కోయబడిన డెబ్బదిమంది రాజులు నా భోజనపు బల్లక్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెననెను. వారు యెరూషలేమునకు అతని తోడుకొనిరాగా అతడు అక్కడ చనిపోయెను.
మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మునుగూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును.
కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయపడును.
దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని.
అది యిచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి.
యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి,
సమాజమునుండి లేచి, యీటెను చేతపట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్లి ఆ యిద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోవునట్లు పొడిచెను; అప్పుడు ఇశ్రాయేలీయులలోనుండి తెగులు నిలిచిపోయెను.
అప్పుడు ఏలీయా ఒకనినైన తప్పించుకొని పోనియ్యక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవియ్యగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలీయా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను.
యెహోవా ఖడ్గము రక్తమయమగును అది క్రొవ్వుచేత కప్పబడును గొఱ్ఱపిల్లలయొక్కయు మేకలయొక్కయు రక్తముచేతను పొట్లేళ్ల మూత్రగ్రంథులమీది క్రొవ్వుచేతను కప్పబడును ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును ఎదోము దేశములో ఆయన మహా సంహారము చేయును.
యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక రక్తము ఓడ్చకుండ ఖడ్డము దూయువాడు శాపగ్రస్తుడగును గాక.
ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి.
మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్లు తెచ్చి కుప్పవేసిరి; అక్కడ వారు ఆ కుప్పయొద్ద భోజనము చేసిరి.
కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు,
అయితే మనుష్యులలోగాని జంతువులలోగాని స్వాస్థ్యమైన పొలములలోగాని తనకు కలిగినవాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్టించినయెడల ప్రతిష్ఠించినదానిని అమ్మకూడదు, విడిపింపనుకూడదు, ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతిపరిశుద్ధముగా ఉండును.
నీళ్లు అతని బొక్కెనలనుండి కారును అతని సంతతి బహు జలములయొద్ద నివసించును అతని రాజు అగగుకంటె గొప్పవాడగును అతని రాజ్యము అధికమైనదగును.
మొదటి నెల పదియవ తేదిని జనులు యొర్దానులోనుండి యెక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా
తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి అయిదు చెట్లమీద వారిని ఉరిదీసెను; వారి శవములు సాయంకాలమువరకు ఆ చెట్లమీద వ్రేలాడు చుండెను.
అప్పుడు ఏహూదు తన యెడమచేతిని చాపి తన కుడి తొడమీదనుండి ఆ కత్తి తీసి కడుపుమీద అతని పొడిచెను.
యెహోవా జీవముతోడు, మిమ్మును చంపకుందు నని చెప్పి తన పెద్ద కుమారుడైన యెతెరును చూచినీవు లేచి వారిని చంపుమని చెప్పెను. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు.
అతడు తన సహోదరులను చంపునట్లు అతనిచేతులను బలపరచిన షెకెము యజమానుల మీదికిని వచ్చునట్లును, వారు చేసిన ప్రాణహత్యవారి మీద వచ్చునట్లును, దేవుడు అబీమెలెకున కును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచించిరి.
నాకంటె ముందు నీవు గిల్గాలునకు వెళ్లగా, దహనబలులను బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీయొద్దకు దిగివత్తును; నేను నీయొద్దకు వచ్చి నీవు చేయవలసినదానిని నీకు తెలియజేయువరకు ఏడు దినములపాటు నీవు అచ్చట నిలువవలెను.
వారు ఈ యేడు గురిని తీసికొనిపోయి కొండమీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ యేడుగురు ఏకరీతినే చంపబడిరి; కోతకాలమున యవలకోత యారంభమందు వారు మరణమైరి.
యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా ఇతడు అదోనీయా మీద పడినందున అతడు చనిపోయెను.
ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మెదాతా కుమారుడును అగాగీయుడునగు హామానును ఘనపరచి వాని హెచ్చించి, వాని పీఠమును తన దగ్గర నున్న అధిపతులందరికంటె ఎత్తుగా నుంచెను.
చుట్టు కూడి దానినిబట్టి కేకలువేయుడి అది లోబడ నొప్పుకొనుచున్నది దాని బురుజులు పడిపోవుచున్నవి దాని ప్రాకారములు విరుగగొట్టబడుచున్నవి ఇది యెహోవా చేయు ప్రతికారము. దానిమీద పగతీర్చుకొనుడి అది చేసినట్టే దానికి చేయుడి.
రాజు నేను దాని మరచిపోతిని గాని, కలను దాని భావమును మీరు తెలియజేయనియెడల మీరు తుత్తునియలుగా చేయబడుదురు; మీ యిండ్లు పెంటకుప్పగా చేయబడును.
ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తిమీదికి రాజేయుదును; మీరు వారిని అమ్మి పంపివేసిన ఆ యా స్థలములలోనుండి నేను వారిని రప్పింతును