లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 16: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 17:13

అయితే యెష్షయి యొక్క ముగ్గురు పెద్దకుమారులు యుద్ధమునకు సౌలువెంటను పోయి యుండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా,

2సమూయేలు 13:3

అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు

1దినవృత్తాంతములు 2:13

యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను

2సమూయేలు 13:32

దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి రాజకుమారులైన యౌవనులనందరిని వారు చంపిరని నా యేలినవాడవగు నీవు తలంచవద్దు; అమ్నోను మాత్రమే మరణమాయెను; ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాటనుండి అబ్షాలోము అతని చంపవలెనను తాత్పర్యముతో ఉండెనని అతని నోటి మాటనుబట్టి నిశ్చయించుకొనవచ్చును.

2సమూయేలు 21:21

అతడు ఇశ్రాయేలీయులను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను.

1దినవృత్తాంతములు 20:7

వాడు ఇశ్రాయేలీయులను దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను వాని చంపెను.