లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 18: 16

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను దావీదు జనులకు ముందు వచ్చుచు, పోవుచు నుండుటచేత వారు అతనిని ప్రేమింపగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 18:5

దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి, సుబుద్ధి గలిగి పని చేసికొనివచ్చెను గనుక సౌలు యోధులమీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై యుండెను.

లూకా 19:48

ప్రజలందరు ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొనియుండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు.

లూకా 20:19

ప్రధానయాజకులును శాస్త్రులును తమ్మునుగూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి, ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకొన సమయము చూచిరి గాని జనులకు భయపడిరి.

సంఖ్యాకాండము 27:17

వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై యుండవలెను.

2సమూయేలు 5:2

పూర్వకాలమున సౌలు మామీద రాజైయుండగా నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులనుబట్టి నా జనులను పాలించి వారిమీద అధిపతివై యుందువని యెహోవా నిన్నుగురించి సెలవిచ్చియున్నాడని చెప్పిరి.

1రాజులు 3:7

నా దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించియున్నావు; అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు;

1సమూయేలు 18:13

కాబట్టి సౌలు అతని తనయొద్ద నుండనియ్యక సహస్రాధిపతిగా చేసెను; అతడు జనులకు ముందు వచ్చుచు పోవుచు నుండెను.

సామెతలు 27:21

మూసచేత వెండిని కొలిమిచేత బంగారును తాను పొందిన కీర్తిచేత నరుని పరిశోధింపవచ్చును.