లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 19: 18

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో నున్న సమూయేలునొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచట కాపురముండిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 7:17

మరియు అతని యిల్లు రామాలో నుండినందున అచ్చటికి తిరిగివచ్చి అచ్చటకూడను న్యాయము తీర్చుచుండెను, మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను.

1సమూయేలు 15:34

అప్పుడు సమూయేలు రామాకు వెళ్లిపోయెను, సౌలును సౌలు గిబియాలోని తన యింటికి వెళ్లెను.

1సమూయేలు 28:3

సమూయేలు మృతిబొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టియుండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని దేశములోనుండి వెళ్లగొట్టి యుండెను.

కీర్తనలు 116:11

నేను తొందరపడినవాడనై ఏ మనుష్యుడును నమ్మదగినవాడు కాడనుకొంటిని.

యాకోబు 5:16

మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థత పొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును.

కీర్తనలు 56:8

నా సంచారములను నీవు లెక్కించియున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడియున్నవి అవి నీ కవిలెలో1 కనబడును గదా.