లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 25: 40

క్రాస్-రిఫరెన్స్‌లు

" దావీదు సేవకులు కర్మెలులోనున్న అబీగయీలు నొద్దకు వచ్చిదావీదు మమ్మును పిలిచి నిన్ను పెండ్లిచేసికొనుటకై తోడుకొనిరండని పంపెననగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 24:37

మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లిచేయవద్దు.

ఆదికాండము 24:38

అయితే నా తండ్రి యింటికిని నా వంశస్థులయొద్దకును వెళ్లి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసి కొనిరావలెనని నాచేత ప్రమాణము చేయించెను.

ఆదికాండము 24:51

ఇదిగో రిబ్కా నీ యెదుట నున్నది, ఆమెను తీసికొనిపొమ్ము; యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగును గాకని ఉత్తరమిచ్చిరి.

1సమూయేలు 25:31

నా యేలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకేగాని, నా యేలినవాడవగు నీవు పగతీర్చు కొనినందుకేగాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా యేలినవాడవగు నీకు ఎంత మాత్రమును కలుగకపోవును గాక, యెహోవా నా యేలినవాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకము చేసికొనుము అనెను.