లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 30: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" దావీదు నీవు ఏ దేశపువాడవు? ఎక్కడనుండి వచ్చితివని వాని నడిగెను. అందుకు వాడు నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడైన యొకనికి దాసుడనైతిని; మూడు దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 31:13

నా పనివాడైనను పనికత్తెయైనను నాతో వ్యాజ్యెమాడగా నేను వారి వ్యాజ్యెమును నిర్లక్ష్యము చేసినయెడల

యోబు 31:14

దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును?

యోబు 31:15

గర్భమున నన్ను పుట్టించినవాడు వారినికూడ పుట్టింపలేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా.

సామెతలు 12:10

నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే.

యాకోబు 2:13

కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయపడును.

1సమూయేలు 30:12

వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా

2సమూయేలు 1:8

నీవెవడవని అతడు నన్నడుగగా నేను అమాలేకీయుడనని చెప్పితిని.

1దినవృత్తాంతములు 18:11

ఈ వస్తువులను కూడ రాజైన దావీదు తాను ఎదోమీయులయొద్ద నుండియు, మోయాబీయులయొద్ద నుండియు, అమ్మోనీయులయొద్ద నుండియు, ఫిలిష్తీయులయొద్ద నుండియు, అమాలేకీయులయొద్ద నుండియు తీసికొనిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను.

యోనా 1:8

కాబట్టి వారు అతని చూచి యెవరినిబట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారమేమిటో, నీ వెక్కడనుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, యీ సంగతి యంతయు మాకు తెలియజేయుమనగా