లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 30: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" కాబట్టి దావీదు అతని యొద్దనున్న ఆరువందల మందియును బయలుదేరి బెసోరు వాగుగట్టుకు రాగా వారిలో రెండువందల మంది వెనుక దిగవిడువబడిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 23:13

అంతట దావీదును దాదాపు ఆరువందల మందియైన అతని జనులును లేచి కెయీలాలోనుండి తరలి, ఎక్కడికి పోగలరో అక్కడకు వెళ్లిరి. దావీదు కెయీలాలోనుండి తప్పించుకొనిన సంగతి సౌలు విని వెళ్లక మానెను.

1సమూయేలు 25:13

అంతట దావీదు వారితో మీరందరు మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి, దావీదు కూడను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు నాలుగు వందలమంది బయలుదేరగా రెండువందల మంది సామాను దగ్గర నిలిచిరి.

2సమూయేలు 2:3

మరియు దావీదు తనయొద్ద నున్నవారినందరిని వారి వారి యింటివారిని తోడుకొని వచ్చెను; వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి.