2రాజులు 18: 14
క్రాస్-రిఫరెన్స్‌లు
" యూదారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపి నావలన తప్పు వచ్చినది; నాయొద్దనుండి తిరిగి నీవు వెళ్లిపోయినయెడల నామీద నీవు మోపినదానిని నేను భరించుదునని వర్తమానము చేయగా, అష్షూరు రాజు యూదా రాజైన హిజ్కియాకు ఆరువందల మణుగుల వెండియు అరువది మణుగుల బంగారమును జుల్మానాగా నియమించెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను; తాను వెళ్లిన చోటనెల్ల అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవచేయకుండ అతనిమీద తిరుగబడెను.
అందుకు ఇశ్రాయేలు రాజు నా యేలినవాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమున నున్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా
భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును.
శక్తి లేనియెడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసికొన చూచును గదా.
హెబ్రోను రాజైన హోహామునొద్దకును, యర్మూతు రాజైన పిరాము నొద్దకును,
లాకీషు బొస్కతు ఎగ్లోను
కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలును పిల్లలను పెంచినవారును కూడి యెహూకు వర్తమానము పంపి మేము నీ దాసులము; నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించెదము; మేము ఎవనిని రాజుగా చేసికొనము; నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయుమని తెలియజేసిరి.
మెనహేము ఇశ్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషియొద్దను ఏబదేసి తులముల వెండి వసూలుచేసి యీ ద్రవ్యమును అష్షూరు రాజునకిచ్చెను గనుక అష్షూరు రాజు దేశమును విడిచి వెళ్లిపోయెను.
అతనిమీదికి అష్షూరు రాజైన షల్మనేసెరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయెను.
అతడు ఐగుప్తు రాజైన సోనొద్దకు దూతలను పంపి, పూర్వము తాను ఏటేట ఇచ్చుచు వచ్చినట్లు అష్షూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా, హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలిసికొని అతనికి సంకెళ్లు వేయించి బందీగృహములో ఉంచెను.
యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టిమాటలే. ఎవని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేయుచున్నావు?
అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచివెళ్లి లిబ్నామీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను.
ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండ ఫరోనెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధకములలో ఉంచి, దేశముమీద ఏబది మణుగుల వెండిని, రెండు మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి
ఆ దినమున నీ భుజముమీదనుండి అతని బరువు తీసివేయబడును. నీ మెడమీదనుండి అతని కాడి కొట్టివేయబడును నీవు బలిసినందున ఆ కాడి విరుగగొట్టబడును.
రాజమార్గములు పాడైపోయెను త్రోవను నడచువారు లేకపోయిరి అష్షూరు నిబంధన మీరెను పట్టణములను అవమానపరచెను నరులను తృణీకరించెను.
నీ హృదయము భయంకరమైనవాటినిబట్టి ధ్యానించును. జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు? తూచువాడెక్కడ ఉన్నాడు? బురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు?
బబులోను రాజు దండు యెరూషలేముమీదను మిగిలిన యూదా పట్టణములన్నిటిమీదను యుద్ధము చేయుచుండగా ప్రవక్తయైన యిర్మీయా యెరూషలేములో యూదా రాజైన సిద్కియాకు ఈ మాటలన్నిటిని ప్రకటించుచు వచ్చెను.
లాకీషు నివాసులారా, రథములకు యుద్ధపు గుఱ్ఱములను కట్టుడి; ఇశ్రాయేలువారు చేసిన తిరుగుబాటు క్రియలు నీయందు కనబడినవి అది సీయోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండును.
మోరెషెత్గతు విషయములో మీరు విడుదల కైకోలు ఇయ్యవలసి వచ్చును, అక్జీబు ఇండ్లు ఇశ్రాయేలు రాజును మోసపుచ్చునవై యుండును.
నీనెవే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలోనుండి బయలుదేరియున్నాడు.
మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి.